నర్స్ చేతిలో నుంచి జారిపడ్డ శిశువు.. చివరికి?

praveen
సాధారణంగా పేషెంట్లు ఆస్పత్రికి వచ్చిన సమయంలో డాక్టర్లు వారి ప్రాణాలను నిలబెడుతూ ఉంటారు. సాయశక్తులా ప్రయత్నిస్తూ ప్రజల ప్రాణాలు కాపాడటమే లక్ష్యంగా పెట్టుకుంటారు. కానీ కొంతమంది మాత్రం నిర్లక్ష్యానికి కేరాఫ్ అడ్రస్ గా మారి పోతూ ఉంటారు. ఏకంగా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతు ఉంటారు. ఇక్కడ ఇలాంటి ఒక విస్తుపోయే ఘటన వెలుగులోకి వచ్చింది. నర్సు నిర్లక్ష్యానికి ఒక పసికందు ప్రాణం పోయింది. కొడుకు పుట్టాడు అని ఆ తల్లిదండ్రులు ఎంతో సంతోష పడిపోయారు. ఎప్పుడెప్పుడు కొడుకును డాక్టర్లు తమకు అప్పగిస్తారా చూద్దామా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


 కానీ అంతలో ఒక విషాదకర వార్త ఆ తల్లిదండ్రుల దగ్గరకి చేరింది. అప్పుడే పుట్టిన శిశువు మృతిచెందాడు అంటూ డాక్టర్లు చెప్పడంతో బోరున విలపించారు ఆ తల్లిదండ్రులు. నర్సు నిర్లక్ష్యంగా పసికందును ఎత్తుకోవడం చివరికి చేతిలో నుంచి జారి కింద పడటంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్లోని లక్నో లో వెలుగులోకి వచ్చింది. చింతల్ ప్రాంతంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో ఓ మహిళ మహిళ శిశువుకు జన్మనిచ్చింది. టవల్ సహాయం లేకుండా శిశువును నర్సు ఒంటి చేత్తో ఎత్తుకుంది. ఈ క్రమంలోనే  శిశువు జారి కింద పడిపోయింది. దీంతో తలకు గాయమై మృతి చెందింది కూతురు.


 దీంతో కొడుకు పుట్టాడు అన్న ఆనందం కనీసం నిమిషాలు కూడా లేకుండా పోయింది. ఇది చూసిన తల్లి ఆర్తనాదాలు పెట్టింది. అయితే భయపడిపోయిన కుటుంబీకులు వెంటనే డెలివరీ రూమ్ లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే వారిని సిబ్బంది మృత శిశువు జన్మించింది అని బుకాయించే ప్రయత్నం చేశారు. అయితే శిశువు ఆరోగ్యం గానే పుట్టిందని..  కానీ నర్సు నిర్లక్ష్యం కారణంగా కింద పడి మృతి చెందింది అంటూ సదరు శిశువు తల్లి చెప్పడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలోనే శిశువు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. తలకు గాయం కారణంగా నే శిశువు మృతి చెందినట్లు నివేదికలో వెల్లడయ్యింది కేసు నమోదు చేసుకున్న పోలీసులు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: