ఛీ ఛీ.. ఆడదానికి ఆడదే శత్రువు అంటే ఇదేనేమో?
ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ఏకంగా సెక్యూరిటీ కంపెనీలో పనిచేస్తున్న ఓ మహిళా తోటి ఉద్యోగిని పని ఉంది అంటూ హోటల్ కు పిలిచింది. సహ ఉద్యోగిని ఆమె పిలిచిన చోటుకి వెళ్ళింది మహిళా. కానీ అక్కడికి వెళ్ళిన తరవాత మాత్రం ఆ మహిళ షాక్ అయింది. మహిళ చేత కూల్ డ్రింక్ తాగించి ఆమె స్పృహ తప్పి పడిపోయిన తరువాత మరికొంత మంది అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణాన్ని మొత్తం వీడియో తీశారు. ఇక స్పృహలోకి వచ్చిన తర్వాత తనకు జరిగిన విషయం తెలిసి ఒక్కసారిగా బోరున ఏడ్చేసింది సదరు మహిళ.
ఇక ఈ విషయం ఎవరికైనా బయట చెబితే వీడియోలను లీక్ చేస్తామంటూ బెదిరింపులకు కూడా పాల్పడ్డారు. ఈ క్రమంలోనే ఆ వీడియో అడ్డంపెట్టుకుని ఆమెపై కొంతమంది పలుమార్లు అత్యాచారం చేయడం మొదలుపెట్టారు. ఇక 2020లో ఈ ఘటన జరుగగా.. ఇన్నాళ్ల పాటు వారి టార్చర్ భావిస్తూ వచ్చిన బాధితురాలు చివరికి వేధింపులు తట్టుకోలేక పోలీసులను ఆశ్రయించి జరిగిన దారుణాన్ని వెల్లడించింది. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మహిళలతో సహా ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు. ఈ క్రమంలోనే ఐపీసీ లోని పలు సెక్షన్ల కింద నిందితులపై కేసు నమోదు చేశారు. హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఈ దారుణ ఘటన వెలుగు చూసింది..