ఏపీలో పెరుగుతున్న క్షుద్ర పూజలు..అధికారి పై దాడి..

Satvika
ఏపీలో మూఢ నమ్మకాలు రోజు రోజుకు ఎక్కువ అవుతూన్నాయి.. సైన్స్ ఎప్పటికప్పుడు కొత్త ప్రయోగాలు చేస్తూ రాకెట్ స్పీడ్ లో దూసుకు పోతుంటే, మరో వైపు మూఢ నమ్మకాలు కూడా జెట్ స్పీడ్ లో పెరుగుతూన్నాయని తెలుస్తున్నాయి.. రాయలసీమ జిల్లాల్లో మరి ఎక్కువగా క్షుద్ర పూజలు లాంటివి ఎక్కువగా జరుగుతున్నాయి. ఒక్కొక్కటి బయటకు వస్తుంటే జనాలు భయంతో వణికి పోతున్నారు.. గతంలో ఓ తల్లి దండ్రులు దేవుడు కనిపిస్తాడు. మాకు స్వర్గ ప్రాప్థి కలుగుతుందని తన ఇద్దరు పిల్లలను అతి దారుణం గా చంపారు. ఇప్పుడు మరో ఘటన వెలుగులొకి వచ్చింది.


సైన్స్ నిపుణులు, ప్రభుత్వ అధికారులు ఇలాంటి వాటిని నమ్మవద్దని ఎంతగా హెచరిస్తున్న కూడా కొందరు నమ్మలేదు. వాళ్ళు అనుకున్న పనిని వాళ్ళు చేస్తున్నారు.. వివరాల్లొకి వెళితే.. కర్నూల్ లో మరో ఘటన వెలుగు లోకి వచ్చింది. కర్నూలు జిల్లాలో క్షద్ర పూజలు కలకలం రేపాయి. చేతబడి చేయిస్తున్నాడని ఆరోపిస్తూ దాడులకు దిగడం తో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు కల్పించుకుని సర్దిచెప్పడం తో వివాదం పూర్తిగా తగ్గింది. మంత్రాలయం మండల కల్దేవకుంట సహకార సంఘం సీఈవో పై సిబ్బంది కొందరు దాడి చేశారు.


తమపై అధికారి చేతబడి చేయిస్తున్నారని చెప్పాడు. వారిని అన్నీ విధాలుగా దెబ్బ తీయాలని ఆయన ఇలాంటి పనులు చెస్తున్నారని ఆరొపించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడం తో పోలీసులకు సమాచారం ఇచ్చారు సహకార సంఘం సీఈవో వెంకటేశ్‌. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు వెంకటేష్ పై దాడికి దిగిన వారిని అదుపు చేశారు. తాను ఎలాంటి పూజలు చెయలెదని పోలీసుల ముందు చెప్పాడు. ఎంత చెప్పినా వినకుండా తనపై సిబ్బంది దాడి చేశారని పోలీసుల కు ఫిర్యాదు చేశారు. అతని వివరాల మేరకు కేసు నమోదు చేసుకున్న పొలిసులు పూర్తీ వివరాలు తెలుసుకొనే ప్రయత్నం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: