ఓరి నాయనో.. స్నేహితులే ఇలా చేశారేంటి?

praveen
నేటి సభ్య సమాజంలో బ్రతుకుతున్నది మనుషులా లేకపోతే మనిషి రూపంలో ఉన్న మానవ మృగాలా.. నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు చేస్తుంటే ప్రతి ఒక్కరికి ఇలాంటి అనుమానమే కలుగుతోంది. ఎందుకంటే ఏకంగా మనుషులు సాటి మనుషుల విషయంలో కాస్త అయినా జాలి దయ చూపించడం లేదు. చిన్న కారణాలకే చివరికి ప్రాణాలను తోడేస్తున్న ఘటనలు అందరినీ భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. మనిషి జీవితంలో ఎన్ని బంధాలు ఉన్నా స్నేహబంధం మాత్రం ఎంతో గొప్పది అని చెబుతూ ఉంటారు. రక్తసంబంధం కాకపోయినా అంతకంటే ఎక్కువ ప్రేమ అభిమానాలు స్నేహబంధంలో ఉంటాయి అని అంటూ ఉంటారు.


 ఎలాంటి కష్టం వచ్చినా తోడునీడగా ఉండేది మాత్రం స్నేహితులే అని చెబుతూ వుంటారు చాలామంది. ఇలా కష్టాల్లో తోడుండే స్నేహితులే చివరికి ప్రాణాలను తోడేస్తున్న ఘటనలు మాత్రం నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్నాయి. ఇలాంటిదే జరిగింది ఇక్కడ. ఇద్దరు స్నేహితులు కలిసి ఓ యువకుడి పై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన హైదరాబాద్ నగరంలో వెలుగులోకి వచ్చింది. ఇక ఈ ఘటనలో యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. కొన ఊపిరితో ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతున్నాడూ. సదరు యువకుడు హైదరాబాద్ నగరంలోని ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయం ఆవరణలో ఈ ఘటన చోటుచేసుకుంది.


 ఆదిల్, మహమ్మద్, అజార్ ముగ్గురు మిత్రులు. శుక్రవారం రాత్రి సమయంలో ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయం సమీపంలోని మైదానం లో కూర్చున్నారు.  సరదాగా మాట్లాడుకుంటున్న సమయంలో వీరి మధ్య ఏదో విషయం పై గొడవ జరిగింది.ఇక మాటా మాటా పెరగడంతో గొడవ కాస్త ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలోనే మొహమ్మద్, అజార్ కలిసి అదిల్ పై పెట్రోల్ పోసి నిప్పంటించారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. ఇక బాధితుడి ఒంటికి నిప్పు అంటుకోవడంతో పెద్దగా కేకలు వేస్తూ పరుగులు పెట్టాడూ. దీన్ని గమనించిన స్థానికులు ఆస్పత్రి సిబ్బంది వచ్చి మంటలను ఆర్పే సి పోలీసులకు సమాచారం అందించడం గమనార్హం. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితులను మెరుగైన చికిత్స కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వీరిమధ్య పాదరక్షలు ఏమైనా ఉన్నాయా అనే విషయం పై దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: