ఘోర రోడ్డు ప్రమాదం.. ఎంత మంది చనిపోయారో తెలుసా?
ఇక్కడ ఇలాంటి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ముగ్గురు ప్రాణాలు కోల్పోగా 15 మందికి గాయాలు అయ్యాయి. అనంతపురం జిల్లాలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. అనంతపురం పెద్దవడుగూరు మండలం మిడుతూరు వద్ద ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఆగివున్న లారీని వేగంగా దూసుకు వచ్చిన బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటన జరిగిన సమయం లో బస్సులో ఏకంగా ఇరవై మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇక వేగంగా బస్సు ఢీకొనడంతో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను అనంతపురంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే బస్సు బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న సమయంలో ఇక ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనే దానిపై విచారణ జరుపుతున్నారు. ఇక డ్రైవర్ నిద్రమత్తు వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు పోలీసులు.. అయితే ఇక ఈ ప్రమాదంలో ముగ్గురు చనిపోవడంతో ఇక వారి కుటుంబ సభ్యుల రోదనలు ఆస్పత్రి వద్ద మిన్నంటాయి. రాత్రి ఈ ప్రమాదం జరగడంతో ఇక సహాయక చర్యలు కాస్త ఆలస్యం అయ్యాయి అనేది తెలుస్తుంది.