తన మరదల్ని ప్రేమించాడని.. ఆ బావ ఏం చేసాడో తెలుసా?

praveen
ప్రేమ అనేది ప్రాణాలు పోవడానికి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. రెండు మనసుల మధ్య చిగురించిన ప్రేమ ఎవరో ఒకరి ప్రాణం తీసేస్తూ ఉంది. దీంతో ఇటీవలి కాలంలో ఎన్నో లవ్ స్టోరీ లు  విషాదంగా నేను ముగుస్తున్నాయి. కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటుంటే మరికొంతమంది హత్యలకు గురవుతున్నారు.ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. తాను వివాహం చేసుకోవాలి అనుకుంటున్నా మరదలిని మరో యువకుడు ప్రేమిస్తున్నాడు అన్న విషయం తెలిసి సదరు యువతి బావా తట్టుకోలేకపోయాడు. దీంతో విచక్షణ కోల్పోయి ఏకంగా మరదలి ప్రేమిస్తున్న యువకుడిని దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. తిరుపతిలో వెలుగులోకి వచ్చింది ఈ ఘటన.


 వివరాల్లోకి వెళితే.. కె వి పురం మండలం వడ్డీ పల్లి కి చెందిన దొరస్వామి కుమారుడు రెడ్డి కుమార్  కొన్ని రోజుల నుంచి కనబడటం లేదు అంటూ ఇక పోలీసులకు ఫిర్యాదు చేశారు కుటుంబ సభ్యులు బంధువులు. కాగా రెడ్డి కుమార్ కార్పెంటర్ పనులు చేసుకుంటూ సాగిస్తున్నాడు. అయితే ఇక పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. రెడ్డి కుమార్ వడ్డి పల్లి కి చెందిన ఇంటర్ చదువుతున్న అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. అయితే అదే అమ్మాయిని సదరు యువతి బావ నాగేంద్ర పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడు.


 అయితే ఓ రోజు రెడ్డి కుమార్ తాను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా మరదలిని అని ప్రేమిస్తున్నాడు అన్న విషయం నాగేంద్ర కు తెలిసింది. ఈ క్రమంలోనే ఇటీవల స్నేహితులతో కలిసి సినిమాకు వచ్చిన రెడ్డి కుమార్ ను బస్టాండ్ సమీపంలో కి రావాలని పిలిచాడు నాగేంద్ర. స్నేహితులను వదిలేసి ఒంటరిగా నాగేంద్ర వద్దకు వెళ్ళాడు రెడ్డి కుమార్. ఇద్దరూ కలిసి దగ్గరలో ఉన్న బార్ లో మద్యం కొనుగోలు చేశారు. మార్గమధ్యంలో పెట్రోల్ బంక్ లో ఒక లీటర్ పెట్రోల్ కూడా తీసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి మద్యం తాగారు. పాత రోడ్డు పక్కనే ఉన్న అటవీ ప్రాంతానికి రెడ్డి కుమార్ ను తీసుకెళ్లి తన దగ్గర ఉన్న తాడుతో గొంతు బిగించి హత్య చేశాడూ. ఆధారాలు దొరక్కుండా పెట్రోలు పోసి నిప్పంటించారు. ఇక పోలీస్ విచారణలో విషయాలు వెలుగులోకి రావడంతో నిందితులను అరెస్టు చేశారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: