ఆస్తి పన్ను కట్టలేదు అని.. అధికారులు ఏం చేశారో తెలుసా?

praveen
వేల కోట్ల అప్పు తీసుకొని ఇక ఆ అప్పు ఎగ్గొట్టి విదేశాల్లో జల్సాలు చేస్తున్న వారిని వదిలేసి కేవలం కొన్ని వేలల్లో అప్పులు తీసుకుని చివరికి ఆర్థిక సమస్యల కారణంగా ఆ అప్పు తీర్చకుండా కాస్త ఆలస్యమైనా పేదవారి పై అధికారులు  జులుం  ప్రదర్శిస్తూ ఉంటారు అనే భావన అందరిలో ఉండి ఉంటుంది. ఇప్పటివరకు ఎన్నో సార్లు ఇది నిజం అయ్యింది కూడా.  ఎందుకంటే పంట వేసి నలుగురికి అన్నం పెట్టేందుకు పెట్టుబడి సాయంగా బ్యాంకు నుంచి లోన్ తీసుకుని చెల్లించడానికి కాస్త ఆలస్యం అయితే చాలు బ్యాంకు అధికారులు రైతులను ఇబ్బందులకు గురి చేయడం లాంటివి కూడా చేస్తూ ఉంటాము.
 ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది అని చెప్పాలి. ప్రాపర్టీ టాక్స్ కట్టనందుకు గాను ఏకంగా ఒక వ్యక్తికి షాకిచ్చారు అధికారులు. ఇంట్లో ఉన్న వస్తువులను తీసుకుని వెళ్ళిపోయారు. అయితే  అధికారులు ఇలా వ్యవహరించడంపై ప్రస్తుతం తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. మేడ్చల్ జిల్లా ఫిర్దాజి  గూడ మున్సిపల్ లో ఈ ఘటన జరిగింది. అధికారులు ఇలా దౌర్జన్యాలకు పాల్పడితే  ఇక తమ పరిస్థితి ఏంటి అని కాలనీవాసులు అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉండడం గమనార్హం. అయితే ఆర్థిక సంవత్సరం ముగియడానికి కొద్ది సమయం మాత్రమే ఉండడంతో ప్రస్తుతం మున్సిపల్ అధికారులు పన్నులు వసూలు చేస్తున్నారు.

 ఈ క్రమంలోనే ఫిర్దాజీ గూడా లోని మురళి రెసిడెన్షియల్ లో ఉంటున్న ఒక వ్యక్తి ప్రాపర్టీ టాక్స్ చెల్లించలేదు. 28 వేల రూపాయల బిల్లు పెండింగ్లో ఉండటం గమనార్హం. ఈ క్రమంలోనే సిబ్బందితో కలిసి వచ్చినా మున్సిపల్ అధికారులు టాక్స్ కట్టలేదు అనే కారణంతో ఇంటి తలుపులు పీక్కొని వెళ్లిపోయారు. అంతేకాకుండా ఇంట్లో ఉన్న టీవీ సోఫా సెట్ తో పాటు అన్ని రకాల వస్తువులను తీసుకుపోయారు మున్సిపల్ అధికారులు. ఇలా వ్యవహరించడంపై మాత్రం అటు స్థానికులు అందరూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉండడం గమనార్హం. అయితే ఇంటి ఓనర్ వేరేచోట ఉండగా ప్రస్తుతం ఆ ఇంట్లో అద్దెకు ఉంటుంది కుటుంబం. విషయం ఓనర్ దృష్టికి తీసుకెళ్తానని చెప్పిన సిబ్బంది వినలేదని ఇక అలా అద్దెకు ఉంటున్న వారు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: