45 వెడ్స్ 25.. చివరికి విషాదం?
కాని కట్ చేస్తే.. చివరికి ఈ దాంపత్య జీవితం లో విషాద ఘటన చోటుచేసుకుంది. భర్త శంకరన్న చివరికి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బెంగళూరు హాసన జాతీయ రహదారి లో వెలుగులోకి వచ్చింది. అయితే శంకరన్న ఉరి వేసుకోవడం పై ప్రస్తుతం ఎన్నో సందేహాలు వెలుగులోకి వస్తున్నాయి అని చెప్పాలి. శంకరన్న వ్యవసాయం తప్ప మరో వ్యాపకం ఉండేది కాదు. ఇక ఎన్నో రకాల పంటలు సాగు చేస్తూ బాగానే సంపాదించేవాడు. నగర వాసులకు సైతం సాధ్యం కాని రీతిలో ఒక సుందరమైన భవనం కూడా నిర్మించుకున్నాడు. ఇక వయసు మీద పడుతున్న వివాహం చేసుకోలేదు అంటూ అందరూ హేళన చేస్తున్న పట్టించుకోలేదు. అదే సమయంలో పొరుగు గ్రామం లో ఉండే మేఘన అనే యువతి శంకరన్నకు పరిచయమైంది.
అయితే అప్పటికే మేఘనకు వివాహం జరిగితే ఇక భర్త ఇంటి నుంచి పారిపోయి రెండేళ్లయినా తిరిగి రాలేదు. ప్రస్తుతం ఒంటరిగానే ఉంటోంది మేఘన. ఈ క్రమంలోనే ఇక మేఘన శంకరన్ను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఆస్థి కోసమే వివాహం చేసుకుంటుంది అంటూ కొంతమంది తిట్టిపోసిన పట్టించుకోలేదు. భార్యను ఎంత అపురూపంగా చూసుకునే వాడు శంకరన్న. కానీ అంతలోనే ఏం జరిగిందో చివరికి శంకరన్న ఉరివేసుకున్నాడు. అయితే బెంగళూరులో కాపురం పెట్టాలని మేఘన ఒత్తిడి చేసేదని.. కోట్ల రూపాయల ఆస్తులను విక్రయించి ఇక బెంగళూరులో స్థిరపడాలని తరచూ గొడవ పడేదని దీంతో మనస్తాపం చెందిన శంకరన్న ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..