ప్రేమించిన వ్యక్తి కళ్లెదుటే.. దారుణం?
ఈ ఘటన గురించి ఎవరికి చెప్పుకోవాలో తెలియక తనలో తానే మనస్థాపంతో కుమిలిపోయిన ఆ యువకుడు చివరికి ఆవేదనతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. ఇక ఈ దారుణమైన ఘటన అందరిని ఉలికిపాటుకు గురిచేసింది అని చెప్పాలి. వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని విరుదునగర్ జిల్లా అరుప్పుకొట్టయి ప్రాంతానికి చెందిన యువతి ఆమె ప్రియుడు కలిసి ఇటీవల సముద్ర తీరానికి వెళ్లారు. ఇక బీచ్లో కూర్చుని మాట్లాడుతూ ఉన్న సమయంలో అక్కడికి ముగ్గురు వ్యక్తులు వచ్చారు.
ఈ క్రమం లోనే ఇక్కడ ఏం చేస్తున్నారు అంటూ అడిగారు. ఇక అంతలోనే సదరు యువతీ యువకులతో గొడవ పెట్టుకున్నారు ముగ్గురు వ్యక్తులు. యువకుడిపై దాడి చేశారు. ఇక ఆ తర్వాత అతని కళ్ళెదుటే యువతిపై అత్యాచారం చేశారు. అంతటితో ఆగకుండా ఆమె మెడలో ఉన్న నగలు దోచుకుని పారిపోయారు. ఎంతగానో మనస్థాపం చెందిన ప్రియుడు చివరికి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇక నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు..