షాకింగ్ : మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం చేస్తుండగా.. లోదుస్తుల్లో?

praveen
ఇటీవలి కాలంలో మహిళలు పెళ్లి చేసుకుని కోటి ఆశలతో అత్తారింట్లో అడుగుపెట్టిన తర్వాత అనుకోని ఘటనలు చివరికి వారి జీవితాలు దుర్భరంగా మార్చుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఇటీవలి కాలంలో అదనపు కట్నం కోసం వేధింపులు ఎక్కువ ఉండడంతో భరించలేక ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక్కడ ఓ వివాహిత భర్త అత్తింటి వారి వేధింపులు భరించలేక కష్టాన్ని తల్లిదండ్రులు చెప్పుకునీ వారీపై భారం మోపలేక తనలో తానే కుమిలిపోతుంది. చివరికి ఒకరోజు కఠిన నిర్ణయం తీసుకునే ఆత్మహత్య చేసుకుని తల్లిదండ్రులకు శోకాన్ని మిగిల్చింది ఆమె.

 ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో వెలుగులోకి వచ్చింది. రాహుల్ మొదటి భార్య మరణించడంతో ప్రియాంక అనే యువతిని రెండో వివాహం చేసుకున్నాడు సదరు వ్యక్తి. వీరి కాపురం ఎంతో సాఫీగానే సాగిపోయింది. అంతలో గొడవలు మొదలయ్యాయి. తల్లి చెప్పిన మాటలు వింటూ తరచు రాహుల్ భార్యతో గొడవపడటమే కాదు చేయి చేసుకునేవాడు.  కుటుంబ సభ్యులు సైతం సూటిపోటి మాటలతో చిత్రహింసలకు గురిచేసేవారు. ఇక వీరు వేధింపులు రోజురోజుకి ఎక్కువవడంతో తట్టుకోలేకపోయిన ప్రియాంక చివరికి సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంది. ఉరి వేసుకొని ఆత్మ బలం మరణానికి పాల్పడింది.
 ఈ సంఘటన స్థలానికి పోలీసులకు ఎంత వెతికినా సూసైడ్ నోట్ మాత్రం లభించలేదు. ఈ క్రమంలోనే మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని అటు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అయితే డాక్టర్లు మృతదేహానికి పోస్టుమార్టం చేస్తున్న సమయంలో ఆమె లోదుస్తులలో సూసైడ్ నోట్ లభించింది. ఇక ఈ సూసైడ్ నోట్లో  భర్త అత్తమామలు తనను ఎన్ని చిత్రహింసలకు గురి చేశారు అనే విషయాన్ని స్పష్టంగా రాసింది వివాహిత. రాహుల్ అంటే నాకు ఎంతో ఇష్టం కానీ అతను మాత్రం వారి కుటుంబ సభ్యులు మాటలు విని నన్ను వేధిస్తున్నాడు. అంతే కాకుండా మరో అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఆమెను పెళ్లి చేసుకోవడానికి నన్ను హింసిస్తున్నాడు. నా చావుకి ప్రధాన కారణం ఆ అత్త.. నా మరణం ఊరికే పోకూడదు శిక్ష పడాలి అంటూ సూసైడ్ నోట్లో పేర్కొంది సదరు వివాహిత.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: