మరీ ఇంత దారుణమా.. భర్తను చెట్టుకు కట్టేసి?
పక్కన ఎవరైనా కుటుంబ సభ్యులు ఉన్నారు అంటే చాలు ఇక ఆడ పిల్ల జోలికి వెళ్లకుండా సైలెంట్ గా నే ఉండిపోయేవారు కామాంధులు. కానీ ఇటీవల కాలంలో పక్కన ఎవరైనా ఉన్న సరే వారి పై దాడి చేసి మరి మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్న ఘటనలు ప్రతి ఒక్కరిలో కూడా భయాన్ని కలిగిస్తున్నాయి అని చెప్పాలి. ఇటీవలే ఉత్తరప్రదేశ్లో ఇలాంటి దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ముజఫర్నగర్ జిల్లాలో కొంతమంది దుండగులు ఓ వ్యక్తిని చెట్టుకు కట్టేసి అతడి భార్య పై గ్యాంగ్ రేప్కు పాల్పడిన ఘటన సంచలనంగా మారిపోయింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
వివరాల్లోకి వెళితే.. రాత్రి సమయంలో ఒక వేడుకకు హాజరైన దంపతులు మల్లి బంధువుల ఇంటికి తిరుగు ప్రయాణం అయ్యారు. ఇలా నడుచుకుంటూ వెళుతున్న సమయంలో పది మంది వ్యక్తులు వారిని అడ్డగించారు. ఈ క్రమంలోనే ఆ ఇద్దరినీ కూడా మామిడి తోటల్లోకి లాక్కెళ్లారు. అక్కడ భర్తపై దాడి చేసి చెట్టుకు కట్టేసి చివరికి నలుగురు వ్యక్తులు అతని భార్య పై అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో బాధితులు వెంటనే పోలీసులను ఆశ్రయించి సమాచారం అందించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పది మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇక బాధిత మహిళను వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. ఘటన స్థానికంగా సంచలనం గా మారిపోయింది..