ఇతను మనిషేనా? కోడలితో ఇలాంటి మాటలా?

Satvika
మామ అంటే తండ్రి తర్వాత తండ్రి లాంటి వాడు అని అందరూ అంటారు.. ఆడపిల్లకు తల్లి, తండ్రి లేని లోటు ను అత్తమామలు తీర్చాలి. అది ఒకప్పటి మాట ..కానీ ఇప్పుడు కొడుకు భార్యను కూడా ఎవరూ వదలడం లేదు.. డబ్బు ఆశ, లేదా మాయ మాటలు చెప్పి శారీరకంగా లొబరుచుకున్నారు.. ఇలాంటి ఘటనలు ఈరోజుల్లో ఎక్కువగా జరుగుతున్నాయి.. తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చాయి.. కొడుకు చనిపోతే కోడలికి అండగా వుండాలి. అయితే,వక్ర బుద్ది కలిగిన మామ కోడలి పై మనసు పారెసుకున్నాడు.. కోడలిని శారీరకంగా సుఖాన్ని అందిస్తే తనను చూసుకుంటాను అని చెప్పాడు.


అతను ఇచ్చిన ఆఫర్ ను విని షాక్ అయిన కోడలు ఈ విషయాన్ని భర్త అన్నకు చెప్పింది. కానీ అతను పట్టించుకోకుండా ఉండటం తో పోలీసులను ఆశ్రయించింది.. ఆమె వివరాల ప్రకారం కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు..ఈ విషాధ ఘటన రాజస్థాన్ లో వెలుగు చూసింది.అజ్మీర్‌కు సమీపంలోని ఓ గ్రామానికి చెందిన బాధిత మహిళ భర్త రెండేళ్ల కిందట మరణించాడు. ఆమెకు ఇద్దరు పిల్లలు. భర్త చనిపోయిన తర్వాత ఆమె తన పిల్లలతో కలిసి పుట్టింట్లోనే ఉంటోంది. పిల్లలను పాఠశాలలో జాయిన్ చేసేందుకు ఆర్థిక సహాయం చేయాలని తన భర్త తండ్రిని కోరింది.


అతను నువ్వు అడిగిన సాయాన్ని అందిస్తాను అని చెప్పి నమ్మించాడు.. అయితే అతని కోరిక కూడా తీర్చాలని డిమాండ్ చేశాడు. అతనితో శారీరక సుఖాన్ని అందివ్వాలని కోరాడు.మామ మాట విన్న కోడలు ఆ విషయాన్ని తన బావకు చెప్పింది. కానీ అతను ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు.ఆ మహిళ అజ్మీర్‌లోని పోలీస్ స్టేషన్‌లో తన మామగారిపై ఫిర్యాదు చేసింది. ఫోన్‌లో తన మామగారు మాట్లాడిన మాటలను రికార్డ్ చేసి పోలీసులకు వినిపించింది..మహిళా వివరాల మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతణ్ణి అదుపులోకి విచారణ చేపట్టారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: