అన్నం తినమన్నందుకు.. ప్రాణం తీసుకున్న కొడుకు?

praveen
ఏంటో ఈ లోకం తీరు.. అసలు అర్థం కాని పరిస్థితి నెలకొంది నేటి రోజుల్లో. ఆధునిక సమాజంలో బ్రతుకుతున్నాం... ప్రతి విషయంలో ఎంతో గొప్పగా ఆలోచిస్తున్నాము అని చెబుతున్నారు జనాలు. కానీ వాస్తవంగా చూసుకుంటే మాత్రం చిన్న చిన్న విషయాల్లో కూడా క్షణికావేశంలో ఆలోచిస్తూ చివరికి ప్రాణాలు తీసుకుంటున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇలా నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తుంటే అసలు మనిషి ఆలోచన ఎటు పోతుంది  కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది. కొంతమంది ఆత్మహత్యలు చేసుకోవడానికి గల కారణాలు తెలిసి ఏకంగా ముక్కున వేలేసుకునే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

 తల్లిదండ్రులు మందలించారని టీచర్ తిట్టిందని లేదా ప్రియురాలితో గొడవ జరిగిందని ఇలా చిన్న చిన్న కారణాలకు అక్కడితో జీవితం ముగిసిపోయింది  అని భావిస్తూ ఎంతో మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. చివరికి ఇలా క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని  నింపుతున్నాయి.  ఎంతో మంది తల్లిదండ్రులకు కడుపుకోత మిగులుస్తున్నాయ్. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది అని చెప్పాలి. ఇక్కడ ఓ యువకుడు  ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణం తెలిస్తే మాత్రం షాక్ అవ్వకుండా  ఉండలేరు.

 దిండి లో దేవరకొండ జంగాల కాలనీ కి చెందిన కేతావత్ వసంత్ అనే 23 ఏళ్ల యువకుడు బీటెక్ చదువుతున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవలే మధ్యాహ్నం సమయంలో అన్నం తినకుండా ఉన్నాడు. దీంతో ఇది గమనించిన తల్లి అన్నం తినడం లేదు అంటూ కొడుకును మందలించింది. కానీ తన కొడుకుని అలా మందలించడం కడుపుకోత మిగులుస్తుంది అని మాత్రం ఊహించలేకపోయింది. తల్లి మందలించడంతో మనస్తాపానికి గురైన వసంత్ చివరికి ఇంట్లో నుంచి దిండి డ్యాం లోకి వెళ్లి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై తమకు ఎలాంటి అనుమానం లేదని మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. ఈ ఘటన స్థానికంగా సంచలనం గా మారిపోయింది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: