దగ్గర బంధువే కదా అనుకుంటే.. ఎంత పని చేశాడు?

praveen
అత్యాచారం లైంగిక వేధింపులు.. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇలాంటి వార్తలే. ఆడపిల్లను కామాంధులు దారుణంగా అత్యాచారం చేశారని.. పండు ముసలి వాళ్లను కూడా వదలకుండా లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఇక నెలలు నిండని పసికందులను సైతం అత్యాచారం చేసి బలి తీసుకున్నారని.. ఎక్కడ చూసినా అత్యాచారానికి సంబంధించిన ఘటనలే తెర మీదకు వస్తున్నాయి. ఇక ఇలాంటి ఘటనలు చూసిన తర్వాత సభ్య సమాజంలో మానవత్వం ఉన్న మనుషులు కాస్త ఎంత దారుణంగా మారిపోయారో అని ప్రతి ఒక్కరూ భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.



 ఇది ఇలా రోజురోజుకు వెలుగులోకి వస్తున్న ఘటనలు ఆడపిల్ల జీవితాన్ని అంతకంతకూ ప్రశ్నార్థకంగా మార్చేస్తున్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక బహదూర్పురా పోలీస్ స్టేషన్ పరిధిలోని అసద్ బాబా నగర్ కిషన్ బాగ్ లో కూడా మైనర్ బాలికపై అత్యాచారం ఘటన కలకలం రేపింది. 14 ఏళ్ల మైనర్ బాలికపై ఆరిఫ్ అనే యువకుడు అత్యాచారం చేసిన ఘటన అందరిని ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. అయితే ఇలా 14 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన నిందితుడు ఆ బాలికకు సమీప బంధువు కావడం గమనార్హం. ఈ క్రమంలోనే ప్లాన్ ప్రకారమే సదరు బాలిక తో పరిచయం పెంచుకొని ఆ తర్వాత మాయమాటలు చెప్పి అత్యాచారానికి ఒడిగట్టిన ట్లు తెలుస్తోంది.



 అయితే మైనర్ బాలిక ఆరోగ్యం క్షీణించడంతో చివరికి తల్లిదండ్రులు నిలదీశారు. ఇక జరిగిన విషయం బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో ఒక్కసారిగా నిర్ఘాంతపోవటం తల్లిదండ్రుల వంతయింది. అంతేకాకుండా బాలిక మూడు నెలల గర్భవతి అని తెలియడంతో పోలీసులను ఆశ్రయించారు తల్లిదండ్రులు. ఈ క్రమంలోనే బాధిత తల్లిదండ్రుల దగ్గర నుంచి కంప్లైంట్ తీసుకున్న బహదూర్పురా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలోనే నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఇక నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: