ఒక వయస్సు రాగానే యువత కొన్ని ఆకర్షణలకు వెళ్ళి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు.. అందులో ముఖ్యంగా ప్రేమ.. చిన్న వయస్సులో పుట్టే ప్రేమ కేవలం ఇష్టం మాత్రమే. కానీ యువత మాత్రం అది నిజమైన ప్రేమ అని నమ్మి జీవితాలను మోసం చెసుకుంటారు. ఈ మధ్య కాలం లో ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి.. అలానే ఓ మైనర్ బాలిక ఓ వ్యక్తి ప్రేమలో పడింది. అయితే అతను చెప్పిన మాయమాటలను నమ్మింది. చివరికి జీవితాన్ని చేతులారా నాశనం చేసుకుంది. అతని మోసం తెలుసుకున్న యువతి పోలీసులను ఆశ్రయించింది..
వివరాల్లొకి వెళితే.. ఆంధ్రప్రదేశ్ లో ఈ దారుణ ఘటన వెలుగు లోకి వచ్చింది.. గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన ఓ మైనర్ స్థానికంగా ఉండే తెలంగాణా రాష్ట్రం భువనగిరికి చెందిన రాజేష్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కొద్ది రోజులకు సాన్నిహిత్యంగా మారింది. అలా మెల్ల మెల్లగా ప్రేమగా మారింది.అలా ఇద్దరు కలిసి బాగా తిరిగారు. మాయమాటలు చెప్పి బయట కలుద్దామని ఒప్పించాడు.. ఈనెల ఇరవై రెండున అమ్మాయిని యాదిగిరి గుట్టకు తీసుకెల్లాడు.
అక్కడ దర్శనం అయ్యాక ఒక హోటల్ లో రూమ్ ను అద్దెకు తీసుకున్నారు. ఆమెకు మద్యం తాగించి లోబరుచుకున్నాడు. స్థానికంగా వ్యభిచార గృహం నిర్వహించే తన బంధువైన సిరి అనే మహిళ దగ్గర కు తీసుకెళ్ళి అందించారు.. అప్పుడే తేరుకున్న యువతి అక్కడ నుంచి బయట పడింది. వెంటనే 100 కు కాల్ చేసి జరిగిన విషయాన్నిఅందరికి చెప్పింది. ఆమె తల్లి దండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె వివరాల మేరకు మిస్సింగ్ కేసు పై విచారణ చేపట్టారు.. బాలిక ఫోన్ చెయ్యడం తో అమెను రక్షించారు. పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు.. ఇలాంటి ఘటనలు గుంటూరులో ఎక్కువగా జరుగుతుండటం గమనార్హం...