దారుణం : ప్రేమించిన వాడే ప్రాణం తీశాడు?

praveen
ఇటీవలి కాలంలో ప్రేమ అనేది ప్రాణాలు పోవడానికి కారణం గా మారిపోయింది. ఒకవైపు ప్రేమలో విజయం సాధించలేక ఎన్నో జంటలు ఆత్మహత్య చేసుకుంటున్నాయ్. మరోవైపు కులాంతర మతాంతర వివాహం చేసుకోవడంతో ఇక కన్న తల్లిదండ్రులే కక్ష గట్టి హత్య చేస్తున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తోన్నాయి. మరో వైపు ప్రేమోన్మాదులు రెచ్చిపోతూ  యువతులను దారుణంగా హత్య చేసిన ఘటనలు సభ్యసమాజాన్ని ఉలిక్కిపడేలా చేస్తున్నాయ్. ఇక్కడ ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. ప్రియురాలిని హత్య చేసిన ప్రియుడు తాను కూడా ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు.


 ఈ ఘటన వేలూరు లో వెలుగులోకి వచ్చింది. పదహారేళ్ల బాలిక సాధన ప్రస్తుతం ఇంటర్ చదువుతోంది. అయితే సమీపంలోని కరంఅంబత్తూర్ వీధికి చెందిన రామ్ కుమార్ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అయితే ఇటీవలే రాత్రి సమయంలో ఇంట్లో సాధన మృతి చెంది ఉండగా రామ్ కుమార్ ఉరివేసుకొని కనిపించాడు. ఈ క్రమంలోనే షాకైన తల్లిదండ్రులు  పోలీసులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అయితే సాధనను రామ్ కుమార్ గొంతు నులిమి హత్య చేసి ఇక అతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు అనే విషయం పోలీసు విచారణలో తేలింది. ఇక వీరిద్దరూ ప్రేమించుకున్నారు అని.. వీరి ప్రేమ విషయం తల్లిదండ్రులకు తెలియడంతో వీరి ప్రేమను ఒప్పుకోలేదని దీంతో సాధన రామ్ కుమార్ తో మాట్లాడటం మానేసింది అన్న విషయం బయట పడినట్లు పోలీసులు తెలిపారు.


 ప్రియురాలు మాట్లాడటం లేదు అని కోపం పెంచుకున్న రామ్ కుమార్ ఇంట్లో ఎవరూ లేని సమయం లో ఇక సాధన తో మాట్లాడటానికి వచ్చి చివరికి కోపంతో గొంతు నులిమి హత్య చేశాడు.  ఇక ఆ తర్వాత ప్రియురాలి లేని జీవితం నాకు వద్దు అనుకుని అదే ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కాస్త స్థానికంగా ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారిపోయింది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: