ఐదు రోజుల క్రితం కనిపించకుండా పోయిన మహిళ.. చివరికి ఏం జరిగిందంటే?

praveen
ఇటీవలే కాన్పూర్లోని రతన్ పూర్ లో ఒక ఆర్మీ జవాన్ భార్య అదృశ్యం కావడం సంచలనం గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.  ఇలా అదృశ్యమైన మహిళ చివరికి ప్రాణాలు కోల్పోయింది అన్న విషయం పోలీసు విచారణలో తేలింది.కాన్పూర్లోని మైతా డ్రైనేజి దగ్గర దారుణ హత్యకు గురైనట్టు పోలీసులు ఇటీవల గుర్తించారు. సదరు మహిళకు వేరే వ్యక్తితో సంబంధం ఉంది అనుమానంతోనే  ప్రేమికుడు మరో ఇద్దరితో కలిసి దారుణంగా హత్య చేసినట్లు పోలీస్ విచారణలో అసలు నిజాలు బయటకు రావడం గమనార్హం.

 హత్య కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసి జైలుకు తరలించారు అధికారులు. కేసులు ముక్తార్ అనే వ్యక్తి ప్రధాన నిందితుడుగా ఉన్నాడని చని పోయిన మహిళా ప్రేమికుడు కూడా అతడే అని పోలీసు విచారణలో గుర్తించారు. కాగా ప్రస్తుతం మరింత  విచారణ జరుగుతూ ఉండటం గమనార్హం. కాన్పూర్లోని రతన్ పూర్ కాలనీకి చెందిన సీఆర్పీఎఫ్ జవాన్ ఇంద్రపాల్ మెయిన్పురి లోని ఎన్నికల విధుల్లో ఉన్న సమయంలో భార్య సంగీత ఇద్దరు పిల్లలు శాంతి సిద్ధార్థ ఇంట్లో ఉన్నారు. అయితే ఇటీవలే ఫిబ్రవరి 20 వ తేదీన  తన భార్య కు  కాల్ చేసినప్పుడు స్పందించలేదు. ఏదో జరిగి ఉంటుందని గ్రహించాలి ఇంద్రపాల్ వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు.

 ఈ క్రమంలోనే  పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఇంట్లో ఎవరు లేరు అనే విషయాన్ని గ్రహించారు పోలీసులు. ఫిబ్రవరి 21వ తేదీన ఇంటికి తిరిగి వచ్చిన భర్త స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు  చేయటంతో విచారణ మరింత వేగవంతం చేశారు పోలీసులు. ఈ క్రమంలోనే బాధితురాలి కాల్ రికార్డు లను కూడా పరిశీలించారు. ఈ క్రమంలోనే ఇక ఆమె కనిపించకుండా పోవడానికి ముందు జమాల్పూర్ ప్రాంతానికి చెందిన మెకానిక్ ముక్తార్ కు చివరగా కాల్ చేసినట్లు గుర్తించారు. ఈ క్రమంలోనే అతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా నేరాన్ని అంగీకరించాడు ముక్తార్. ఇక ఈ ఘటన స్థానికంగా సంచలనం గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: