కామాంధుడైన బస్ డ్రైవర్.. చివరికి ఏం జరిగిందంటే?

praveen
ఎటు పోతుంది నేటి సమాజం తీరు.. ఎటుపోతుంది నేటి మనుషుల ఆలోచన తీరు.. సృష్టికి మూలమైన ఆడపిల్ల రోజురోజుకు ప్రశ్నార్థక జీవితాన్ని గడపాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నేటి రోజుల్లోమనుషులు ఆధునిక సమాజంలో కి అడుగుపెడుతున్నారు. అనాగరిక అలవాట్లను వదిలేస్తున్నారు. సరికొత్తగా జీవించడానికి ప్రయత్నిస్తున్నారు అని అందరూ చెబుతున్నారు. కానీ నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తుంటే ఆధునిక సమాజం లో మనుషుల్లో మానవత్వం కూడా కనుమరుగైపోతుంది అన్నది అర్ధమవుతుంది.. ఎందుకంటే మానవత్వానికి కేరాఫ్ అడ్రస్ అయిన మనుషులు కాస్త మానవ మృగాలు గా మారిపోతున్నారు. ఇటీవల తరచూ ఆడ పిల్లల పై అత్యాచారానికి పాల్పడిన ఘటన రోజురోజుకు వెలుగులోకి వస్తున్నాయి.

  ఎన్ని కఠిన శిక్షలు విధించినా ఏకంగా ఎన్కౌంటర్ చేసి పంపినప్పటికీ ఎక్కడ ఏ మాత్రం మార్పు రావడం లేదు అని చెప్పాలి. కనుచూపు మేరలో ఆడపిల్ల కనిపిస్తే చాలు దారుణంగా అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వస్తున్నాయి. కేవలం బయట వాళ్ళు మాత్రమే కాదు ఏకంగా సొంతవాళ్లు సైతం ఆడపిల్లలపై అత్యాచారాలు పాల్పడుతున్న ఘటనలు సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేస్తున్నాయి. ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది ఇక్కడ. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మహిళ ప్రయాణిస్తున్న సమయంలో బస్సు డ్రైవర్ ఇక  ప్రయాణికురాలు పై లైంగిక దాడికి పాల్పడిన ఘటన హైదరాబాద్ నగరంలో వెలుగులోకి వచ్చింది.

 అత్యాచారానికి గురైన బాధితురాలు కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది అని తెలుస్తోంది. ఈనెల 23వ తేదీన ఊరికి వెళ్లేందుకు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు టికెట్ బుక్ చేసుకుంది ఒక యువతి. ఈ క్రమంలోనే ఇక బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో అర్ధరాత్రి డ్రైవర్ కత్తితో బెదిరించి లైంగికదాడి చేశాడు అంటూ మహిళ ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు న్యాయం చేయాలని వెంటనే నిందితులను అరెస్టు చేసి చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తుంది. ఈ ఘటన స్థానికంగా సంచలనం గా మారిపోయింది అని చెప్పాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: