దారుణం.. స్కూల్ టీచర్ పై రేప్?
ఇటీవలే మహారాష్ట్రలో ఇలాంటి ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ముంబైలోని రాయగడ్ జిల్లాలో గుజరాత్కు చెందిన 21 ఏళ్ల టీచర్ పై ఇద్దరు కామాంధులు దారుణంగా అత్యాచారానికి పాల్పడిన ఘటన స్థానికంగా ఒక్కసారికి ఉలిక్కిపడేలా చేసింది. అయితే బాధితురాలికి ఐదు నెలల క్రితం నిందితులలో ఒకరైన ఇద్రీస్ ఖాన్ సోషల్ మీడియాలో పరిచయం ఏర్పడినట్లు తెలుస్తోంది. పరిచయం స్నేహంగా మారి పోయింది. ఇటీవల ఇద్రీస్ తన పుట్టిన రోజుకి టీచరునీ కూడా ఆహ్వానించాడు. ఈ క్రమంలోనే స్నేహితుని ఆహ్వానాన్ని మన్నించినా బాధితురాలు పుట్టినరోజు వేడుకకు వచ్చేందుకు బయలుదేరింది. బాంద్రా రైల్వే స్టేషన్ లో దిగింది.
అక్కడే తన స్నేహితుడితో కలిసి సదరు యువతిని కలుసుకున్నారు ఇద్రీస్ ఖాన్. ఇక టాక్సీలో ఆమెను తలోజా వద్దకు తీసుకువచ్చి చివరికి అక్కడ స్నేహితుడి ప్లాట్ లో సదరు మహిళ పై అత్యాచారం చేశాడూ. అనంతరం జహీర్ అలీ కూడా ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్లు తెలుస్తోంది. కామాంధుల నుంచి తప్పించుకున్న సదరు యువతి పోలీస్ కంట్రోల్ రూమ్ కు చేరి విషయాన్ని తెలియజేసింది. ఈ క్రమంలోనే కేసు నమోదు చేసుకున్న పోలీసులు పలు వివరాలను సేకరించి ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. ఇక తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు పోలీసులు.