బంగారాన్ని తాకట్టు పెడితే.. ఆ బ్యాంకు మేనేజరు ఇలా చేశాడేంటి?
దీంతో ఏ క్షణంలో ఖాతా ఖాళీ అయి మోసపోతామో అని అనుక్షణం అందరూ భయపడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అయితే ఇలా తమ వినియోగదారులకు ఎలాంటి సమస్యలు ఎదురుకాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఒక బ్యాంకు మేనేజర్ ఇక్కడ ఏకంగా బ్యాంకు కస్టమర్లకు షాక్ ఇస్తూ చేతివాటం చూపించాడు. కస్టమర్లు ఆ బ్యాంకులో తాకట్టు పెట్టిన మొత్తాన్ని కాజేశాడు ఇక్కడ ఒక బ్యాంక్ మేనేజర్. ఐ ఐ ఎఫ్ ఎల్ బ్యాంకు మేనేజర్ గా పని చేస్తున్నాడు రాజ్ కుమార్. ఇటీవలే కస్టమర్లు బ్యాంకులో బంగారాన్ని తాకట్టు పెట్టారు. బెట్టింగ్ పెట్టడానికి బానిసగా మారిన సదరు బ్యాంక్ మేనేజర్ పెద్ద మొత్తంలో బంగారం కాజేశాడు.
దాదాపు కస్టమర్లు తనఖా పెట్టిన 14.5 కిలోల బంగారాన్ని స్వాహా చేశాడు. వన్ స్టార్ బెట్ యాప్ లో రాజ్ కుమార్ క్రికెట్ బెట్టింగ్ పెడుతూ ఉంటాడు. ఇక దానికి బానిస గా మారి పోయి ఇటీవలే కోట్ల రూపాయల బెట్టింగ్ పెట్టాడు రాజ్కుమార్. తన వద్ద అంత పెద్ద మొత్తంలో లేకపోవడంతో ఇక తాను పనిచేసే బ్యాంకులో నుంచి బంగారాన్ని స్వాహ చేశాడు. అయితే రాజ్ కుమార్ నిర్వహణపై ఐఐఎఫ్ ఎల్ సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. అయితే తమ బంగారం తమకు ఇప్పించాలంటూ ఖాతాదారులు కోరుతున్నారు..