భర్త అత్యాచారం.. పక్కనే ఉండి ఎంకరేజ్ చేసిన భార్య?

praveen
భార్య అంటే భర్త లో సగభాగం అని చెబుతూ ఉంటారు. అందుకే భర్త కష్టసుఖాల్లో భార్య పాలుపంచుకోవాలి అని చెబుతూ ఉంటారు. ఇక ఇదే మాటని ఇక్కడ ఒక మహిళ మాత్రం గుడ్డిగా ఫాలో అయ్యింది అన్నది అర్ధమవుతుంది. సాధారణంగా భర్త ఏదైనా నేరాలకు పాల్పడుతూ ఉంటే వద్దు అని వాదిస్తూ ఉంటుంది భార్య. లేదా పోలీసులకు ఫిర్యాదు చేసి భర్తను పట్టించిన మహిళామణులు కూడా ఎంతోమంది ఉన్నారు. కానీ ఇక్కడ ఒక మహిళ మాత్రం దారుణంగా వ్యవహరించింది. సాటి మహిళ పట్ల  భర్త దారుణంగా వ్యవహరిస్తున్నప్పటికీ రాక్షస  ఆనందాన్ని పొందింది సదరు మహిళ.


 మరో మహిళపై భర్త అత్యాచారం చేస్తుంటే చూసి గమనించిన భార్య దగ్గరుండి ఎంకరేజ్ చేసింది. అంతేకాదు ఇక భర్త అత్యాచారం చేస్తున్న మొత్తాన్ని కూడా పక్కనే వుండి సెల్ఫోన్లో చిత్రీకరించింది. ఈ దారుణమైన ఘటన విజయవాడలో వెలుగులోకి వచ్చింది. ఇక బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ నిందితులు ఇద్దరు ని కూడా అరెస్టు చేశారు. అజిత్సింగ్నగర్ పరిసర ప్రాంతాల్లో ఉండే ఒక వివాహిత భర్త క్యాటరింగ్ పని చేస్తూ ఉంటాడు.


 ఇక ఇటీవల భర్త పరిమితం బయటకు వెళ్లడంతో ఇద్దరు పిల్లలతో కలిసి ఇంట్లో నిద్రపోయింది సదరు వివాహిత. ఎదురు ఇంట్లో ఉంటున్న దిలీప్ తులసి అనే భార్య భర్తలు రాత్రి 11 గంటల సమయంలో ఆ వివాహిత ఇంట్లోకి ప్రవేశించారు. ఇక వివాహిత నోరు మూసి గుట్టుచప్పుడు కాకుండా తమ ఇంట్లోకి లాక్కెళ్లారు. ఈ క్రమంలోనే దిలీప్ సదరు వివాహితపై రెండుసార్లు అత్యాచారం చేశాడు. పక్కనే ఉన్న భార్య అదంతా అడ్డుకోవాల్సినది పోయి వీడియోలు ఫోటోలు తీసింది. ఈ వీడియో ల తో మరోసారి  వివాహితపై అత్యాచారం చేశాడు సదరు వ్యక్తి. వేధింపులు ఎక్కువవడంతో పోలీసులను ఆశ్రయించింది సదరు మహిళ. ఈ ఘటనతో పోలీసులు సైతం షాక్ అయ్యారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: