దారుణం.. పోలీసే ఆమె పాలిట యముడు అయ్యాడా?

Satvika
ప్రజలను కాపాడాల్సిన పోలీసులు ఇప్పుడు ప్రజల పాలిట రాక్షసులుగా మారారు. ఇప్పటికే చాలా ఘటనలు పునరావృత్తం అవుతున్నా కూడా ప్రభుత్వ అధికారులు మాత్రం నామ మాత్రంగా చర్యలను తీసుకొని వదిలెస్తున్నారు. దాంతో కొందరు పోలీసులు మళ్ళీ వాళ్ళు చేసే పనులు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా ఒక పోలీసు అధికారి ఒక పని చేసాడు. అది సమాజం సిగ్గు తో తల దించుకొనెల ఉంది.. పూజల పేరుతో ఒక యువతిని బంధించారు.


వివరాల్లొకి వెళితే.. న్యాయం చేయండంటూ వచ్చిన బాధితులనే మోసం చేసిన పోలీసులు చాలా మందే ఉన్నారు.. చెన్నైలో తాజాగా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. దుష్ట నివారణ పూజల పేరుతో ఓ యువతిని ఏకంగా 40 రోజులు పాటు గదిలో బంధించాడు. ఇది నిజంగా దారునమని చెప్పాలి. ఈ విషయం పోలీస్ లపై నమ్మకాన్ని తగ్గిస్తున్నాయి. తమిళనాడు పళ్లికరణై లో ఓ యువతి నివాసం ఉంటోంది. విదేశాల్లో ఉన్న ఆమె తల్లిదండ్రులు ఇటీవలే మృతి చెందారు. ప్రస్తుతం యువతి ఒంటరిగా జీవనం సాగిస్తోంది. గతంలో మిస్ చెన్నై పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచింది.


ఇటీవల సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ మంచి పేరు తెచ్చుకుంది. ఈమెకు సొంత స్థలం కూడా ఉందని   వెల్లదించింది.ఆ స్థలంలో బిల్డింగ్ కడతానని మోసం చేసినట్లు ఆమె ఫిర్యాదు చేశారు. కేసు విచారణ పేరుతో ఎస్సై దగ్గయ్యాడు..తన పర్సనల్ విషయాలను కూడా అతడి తో షేర్ చేసుకునేది. తన ఇంట్లో సమస్యలు ఉన్నాయని, అందుకే తన తల్లిదండ్రులు అనారోగ్యంతో చనిపోయారని అతని వద్ద వాపోయింది.ఆమె బలహీనతను అవకాశంగా తీసుకున్న అతను ఆమె వాడుకోనే ప్రయత్నం చేశారు.గదిలో బంధించి 40 రోజుల పాటు చిత్రహింసలకు గురిచేశాడు. అతని చెర నుంచి బయట పడిన ఆమె ఉన్నతాధికారులకు ఫిర్యాధు చేసింది. ప్రస్తుతం అతను పరారిలో వున్నట్లు తెలుస్తుంది...


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: