ఇతను మరో పుష్ప.. ఎర్రచందనం ఎలా స్మగ్లింగ్ చేశాడంటే?

praveen
తెలుగు ప్రేక్షకులందరూ పుష్ప సినిమా చూసే ఉంటారు. అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా అందరిని మెప్పించింది. పుష్ప.. పుష్ప రాజ్ తగ్గేదెలా... అంటూ పుష్పరాజ్ తనదైన మేనరిజం తో ఎర్రచందనం స్మగ్లింగ్ చేయడం అందర్నీ ఆశ్చర్య పరుస్తూ ఉంటుంది. అయితే ఇలా అల్లు అర్జున్ పుష్ప సినిమా ఎంతో మంది ప్రేక్షకులను అలరించింది. కానీ కొంతమందినీ మాత్రం బాగా ప్రభావితం చేసింది.  ఎంతలా అంటే కేవలం అల్లు అర్జున్ మాత్రమే ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తాడా అలాంటి స్మగ్లింగ్ మా వల్ల ఎందుకు కాదు.. చూపిస్తాం మా సత్తా ఏంటో అంటూ ఎంతో మంది స్మగ్లింగ్ కు పాల్పడుతున్నారు.. పాపం పిచ్చి వాళ్ళు అది సినిమాలో అని మాత్రం గుర్తు పెట్టుకో లేకపోతున్నారు.



 రియల్ లైఫ్ లో అలా చేస్తే పోలీసులు తాట తీస్తారు అని మాత్రం మరిచిపోతుంటారు. చివరికి పుష్ప సినిమాలో లాగానే స్మగ్లింగ్ చేయడానికి ప్రయత్నిస్తూ పోలీసులకు చిక్కి చివరికి కటకటాల వెనక్కి వెళ్తున్నారు.  పాల క్యాన్లు కింద ఒక ప్రత్యేక అర ఏర్పాటు చేసి అక్కడ ఎర్రచందనం దుంగలను పెట్టి పైన పాలను పోసి ఇక ఎవరికి తెలియకుండా ఎర్రచందనం స్మగ్లింగ్  చేస్తూ ఉన్న సీన్ ఒకటి ఉంది. ఇక అచ్చం ఇలాగే మొన్నటికి మొన్న నిషేధిత గుట్కా గంజాయి ప్యాకెట్లను వ్యాన్ లో కింద ఒక ప్రత్యేకమైన అర ఏర్పాటు చేసి  పైన ఆయిల్ డ్రమ్ములు పెట్టి స్మగ్లింగ్  చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.



 ఇప్పుడు ఇలాంటి ఘటనే జరిగింది. ఇక్కడ మనం మాట్లాడుకునే వ్యక్తి అచ్చం పుష్ప సినిమాలో పుష్ప రాజ్ మాదిరే. ఎర్రచందనం రవాణా చేస్తూ ఇటీవల పోలీసులకు చిక్కాడు. సయ్యద్ యాసీన్ అనే వ్యక్తి పుష్ప సినిమాలో లాగ కింద ఒక ప్రత్యేకమైన అర ఏర్పాటు చేసి పైన పండ్లు పెట్టాడు. కరోనా బాధితులకు పండు సరఫరా చేస్తాను.. నేను చాలా మంచి వాడిని అని పోలీసులను నమ్మించే ప్రయత్నం చేశాడు.. ఈ క్రమంలోనే ఆంధ్ర కర్ణాటక చెక్ పోస్టులలో పోలీసుల నుంచి తప్పించుకున్నాడు. చివరికి మహారాష్ట్ర చెక్పోస్ట్ వద్దకు వచ్చేసరికి పోలీసులు   తనిఖీ చేయడంతో అసలు విషయం బయటపడింది. ఏపీ నుంచి తెచ్చిన టువంటి 2.45 కోట్ల ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: