చెల్లికి అంగరంగవైభవంగా పెళ్ళి చేసాడు ఓ అన్న.. అయితే అతనికి ఊహించని రీతిలో షాక్ తగిలింది. చెల్లిని వదిలి పెట్టడానికి వెళ్ళిన అన్న వరుడుగా మారాడు. అది ఏంటి అని ఆలోచించే లోపు పరిస్థితి అతని చెయ్యి దాటిపొయింది..అతనికి ఇష్టం లేకుండా మరో మహిళ మెడలో తాళి కట్టారు. ఇది నిజంగా ఆశ్చర్యానికి గురిచెస్తుంది. ఆ తర్వాత తన తో కాపురం చేయలేను అంటూ భాధ పడ్డాడు. అతని పరిస్థితి ఏంటి.. చివరకు ఆమెను ఒప్పుకున్నాడా? లేదా? అన్నధి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
వివరాల్లొకి వెళితే.. ఈ ఘటన బీహార్ లో వెలుగు చూసింది. బీహార్‌లోని దాల్ సింగ్ సరాయిలోని సాతాలో ఈ ఘటన జరిగింది. సాతా ప్రాంతానికి చెందిన వినోద్ అనే వ్యక్తి తన చెల్లిని అత్తారింట్లో దింపేందుకు సమస్తిపూర్ వెళ్లాడు. వినోద్ వెళ్లేటప్పటికి చెల్లి అత్తారింట్లో ఆమె ఆడపడుచు వివాహం గురించి చర్చ జరుగుతోంది. ఆమెకు పెళ్లి కావడం లేదని, కట్నం ఎక్కువగా అడుగుతున్నారని చెల్లి అత్తింటి వాళ్ళు చర్చలు చేస్తూ బాధపడుతున్నారు. వినోద్‌ను చూడగానే వారికి ఓ ఆలోచన వచ్చింది.. వినోద్ కు పెళ్ళి కాలేదు.. దాంతో వాళ్ళు అతనికి ఇచ్చి పెళ్ళి చేయాలనీ నిర్ణయం తీసుకున్నారు.
వినోద్‌ను సమీపంలోని ఖుద్నేశ్వర్ ఆలయానికి తీసుకెళ్లారు. అక్కడ అతని ముందు తమ ఇంటి ఆడపిల్లను నిలబెట్టారు.అక్కడ ఏం జరుగుతుందో అర్థం చేసుకోనే లోపు వినోద్ చేతిలో దండ పెట్టారు. అమ్మాయి మెడలో వెయ్యమని కోరారు. వెయ్యాలని బలవంతం చేశారు.. తాళి కట్టాలని అతణ్ణి ఇబ్బంది పెట్టారు.అమ్మాయి మెడలో తాళి కట్టించారు. వినోద్‌కు ఇష్టం లేకుండా పెళ్లి తంతును పూర్తి చేశారు. దీంతో వినోద్ ఆ అమ్మాయిని అక్కడే వదిలేసి ఇంటికి వెళ్లిపోయాడు. తనకు బలవంతంగా పెళ్లి చేశారని, అమ్మాయితో కాపురం చెయనని చెప్పాడు.. ఈ విషయం పై ఇరు కుటుంబాలు చర్చలు జరుపుతున్నారు. ఎటు వైపు వెళ్తుందో తెలియాల్సి వుంది.