వార్ని.. దీనికి కూడా సూసైడ్ చేసుకుంటారా?

praveen
మనిషి ప్రాణాలకు రోజురోజుకీ విలువ లేకుండా పోతుందబ్బా. అవును నిజమే.. ఇది ఎవరో చెబుతుంది కాదు. రోజురోజుకీ వెలుగులోకి వస్తున్న ఘటనలె చెబుతున్నాయి. ఎంతో మంది మనుషులు సాటి మనుషుల విషయంలో కాస్త కూడా జాలి చూపించకుండా దారుణంగా హత్యలకు పాల్పడుతున్నారూ. ఇలా చిన్నచిన్న విషయాలకే ఏకంగా ప్రాణాలను గాల్లో కలిపేస్తున్నారు. ఎంతోమంది పరాయి వాళ్ల   విషయంలోనే కాదు సొంత వాళ్ల విషయంలో కూడా ఎక్కడ జాలి దయ లేదు చూపించడం లేదు మానవత్వానికి కేరాఫ్ అడ్రస్ అయిన మనుషులు. అదే సమయంలో  చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్యలు చేసుకుంటూ బలవన్మరణాలకు పాల్పడుతున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది.

 టీచర్ తిట్టిందని.. ప్రియురాలు మాట్లాడటం లేదని.. తల్లిదండ్రులు మందలించారని.. ఇలా చిన్న చిన్న కారణాలతో కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు ఎంతోమంది. ఇలా చిన్నచిన్న విషయాలకే క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలు తీసుకుని ఎంతోమంది ప్రాణాలు బలవంతంగా తీసుకోవడమే కాదు ఎన్నో కుటుంబాలలో కూడా విషాద నింపుతున్నారు అని చెప్పాలి. ఇక ఎంతో మంది తల్లిదండ్రులకు తీరని కడుపుకోత మిగులుస్తున్నారు. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది.  ఆ యువకుడు ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణం తెలుసుకున్నారు అంటే ఈ కారణానికి కూడా ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటారా అని అవాక్కవుతారు అందరూ.

 ఇటీవలే అతను ఎంతో ఇష్టంగా   హెయిర్ కటింగ్ షాప్ కి వెళ్లి హెయిర్ కట్  చేయించుకుని ఇంటికి వచ్చాడు. కానీ ఇంటికి వచ్చిన తర్వాత మాత్రం తండ్రి హెయిర్ స్టైల్ చూసి బాగా లేదు అంటూ కొడుకును మందలించాడు. దీంతో ఈ చిన్న కారణానికి ఆత్మహత్య చేసుకున్నాడు సదరు యువకుడు. ఈ ఘటన మహబూబాద్ జిల్లా గూడూరు మండలంలో వెలుగులోకి వచ్చింది. ఇంటర్ విద్యను అభ్యసిస్తున్న వెంకటేష్ బుధవారం మోడ్రాన్ హెయిర్ స్టైల్ కటింగ్ చేయించుకున్నాడు. ఇంటికి వచ్చాక కటింగ్ బాగాలేదని ఇలా ఎందుకు చేయించుకున్నావ్ అంటూ తండ్రి మందలించడంతో మనస్థాపం చెంది చివరికి ఇంటి నుంచి వెళ్లిపోయిన యువకుడు  చెరువు గట్టుపై విగతజీవిగా కనిపించడం గమనార్హం. ఇక పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: