కట్నం తెస్తావా చస్తావా అన్న భర్త.. భార్య ఏం చేసిందంటే?

praveen
భార్య భర్తల బంధం అంటే అన్యోన్యతకు కేరాఫ్ అడ్రస్ గా ఉండాలి. కుటుంబ సభ్యులు   బంధుమిత్రులు అందరి సాక్షిగా మూడుముళ్ల బంధంతో ఒక్కటైన తర్వాత చివరి శ్వాస వరకు ఒకరికి ఒకరు తోడుగా ఉండాలి భార్య భర్తలు. ఏ కష్టం వచ్చినా నేనున్నాను అనే భరోసా ఇవ్వాలి భర్త. ఇటీవలి కాలంలో మాత్రం భార్యాభర్తల మధ్య అన్యోన్యత కరువైపోతుంది. ఒకరి భావాలను ఒక అర్థం చేసుకోలేకపోతున్నారు భార్యాభర్తలు. దీంతో జీవితంలో సర్దుకుపోతూ కాకుండా ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు ఉండటంతో ఎన్నో  దారుణ ఘటనలు వెలుగులోకి వస్తున్నాయ్. అంతే కాకుండా నేటి నాగరిక సమాజంలో కూడా మహిళలకు అదనపుకట్నం వేధింపులు మాత్రం ఎక్కడా తగ్గడం లేదు అని చెప్పాలి.

 ఇటీవలి కాలంలో పెళ్లి చేసుకొని కోటి ఆశలతో అత్తారింట్లో అడుగుపెడుతున్న ఎంతో మంది అమ్మాయిలకు అదనపు కట్నం వేధింపులు ఎదురవుతున్నాయి. ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటాను అని చెప్పినా భర్తే అదనపు కట్నం కావాలంటూ చిత్రహింసలకు గురి చేస్తూ ఉండడంతో ఎంతోమంది యువతూలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇక్కడ ఇలాంటి ఒక విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది. పెళ్లయిన తర్వాత ఎన్నో ఆశలతో అత్తారింట్లో అడుగుపెట్టింది ఆ యువతి. కొన్నాళ్ళ వరకు అంతా సవ్యంగానే సాగిపోయింది. కానీ ఆ తర్వాత అత్తారింటి అసలు రంగు బయటపడింది.

 అదనపు కట్నం తీసుకురావాలని అంటూ భర్త అత్తమామలు వేధించడం మొదలు పెట్టడంతో మనస్థాపం చెందిన సదరు మహిళ ఆత్మహత్య చేసుకుని బలవన్మరణానికి పాల్పడిన ఘటన మెదక్ జిల్లా చేగుంట మండలంలోని నావాబా పేట లో వెలుగులోకి వచ్చింది. చేగుంట కు చెందిన షేక్ ఇబ్రహీం కు రెండేళ్ల క్రితం వివాహం జరిగింది . వివాహ సమయంలో కట్నకానుకల తో పాటు లక్ష రూపాయల కట్నం కూడా ఇచ్చారు. తర్వాత కొన్నాళ్ళ వరకు భార్యతో అన్యోన్యం గానే ఉన్నా షేక్ ఇబ్రహీం ఆ తర్వాత మాత్రం అదనపు కట్నం తీసుకురావాలని భార్యను వేధించడం మొదలుపెట్టాడు. భర్త అత్తమామల నుంచి వేధింపులు ఎక్కువవడంతో చివరికి జీవితం వృధా అనుకున్న మహిళా బలవన్మరణానికి పాల్పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: