రమ్మన్నప్పుడు రాలేదని ప్రియుడు ఎంత పని చేశాడు?

Satvika
ఈరోజుల్లో యువత చదువును పక్కన పెట్టి ప్రేమ, పెళ్ళి అంటూ చెడు తిరుగుల్లు తిరుగుతున్నారు. అమ్మాయిలతో శారీరక సుఖం పొందే క్రమంలో ప్రేమ పేరుతో మోసం చేస్తున్నారు.మొదట్లో అమ్మయిదగ్గర మార్కులు కొట్టేయాలని ఎన్నెన్నో జిమ్మిక్కులు చేస్తున్నారు. కొద్ది రోజులు వాడుకొని మోజు తీరిన తర్వాత వాడుకున్న వస్తువును పడేసినట్లు వదిలెస్తున్నారు. ఇప్పుడు కూడా అలాంటి అమానుష ఘటన వెలుగు చూసింది. ఒక అమ్మాయి కి వల వేసి శారీరకంగా దగ్గర అయ్యాడు. చివరికి వీడియోలు తీసి బెదిరింపులకు దిగాడు.

వివరాల్లొకి వెళితే.. ఈ దారుణ ఘటన సూర్యాపేట లో వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని హుజూర్‌నగర్‌ లో ఈ దారుణం చోటుచేసుకుంది. అక్కడే వుండే ఒక దళిత మైనర్ అమ్మాయి ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఇకపోతే అదే గ్రామానికి చెందిన మహేష్ అనే వ్యక్తిని ప్రేమించింది. ఇద్దరు కలిసి పీకల్లోతు ప్రేమలో మునిగితెలారు. అతను పెళ్ళి చేసుకుంటాను అని నమ్మబలికితే అతనికి అన్నీ సమర్పించుకుంది. అలా వాళ్ళు చాలా సార్లు కలిశారు.

అలాంటి సమయంలో అతడు వీడియోలు తీసుకున్న వి, ఫోటోలను తీసుకున్నాడు. అనంతరం కొద్ది నెలల క్రితం నగ్నంగా వీడియో కాల్స్ లో కనిపించాలని కోరటంతో ఆమె అలాగే చేసింది. ఆ వీడియో కాల్‌ను మహేశ్‌ సేవ్‌ చేసి పెట్టుకున్నాడు.. అయితే ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అయితే అతనికి ఫీలింగ్స్ వచ్చినప్పుడు కోరిక తీర్చాలని కోరాడు. అందుకు ఆమె నిరాకరించింది. కోపంతో రగిలిపోయాడు. బాలిక నగ్న వీడియోను తన వాట్సప్‌ స్టేటస్‌లో పెట్టాడు. దీంతో ఆ వీడియో చూసిన స్థానికులు సదరు బాలికకు విషయం చెప్పడంతో ఒక్కసారిగా షాకైంది.. ఈ విషయాన్ని తన పేరెంట్స్ కు చెప్పింది. అతని కుటుంబం వున్న ప్లేస్ లోకి వెళ్ళి చూస్తె లేరు అతను కూడా పారిపొయాడు. వెంటనే పోలీసులను ఆశ్రయించారు.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: