కరోనా సోకుతుందేమో అని అలా చేసారు.. ప్రాణం పోయింది?

praveen
మొదటి దశ నుంచి భారత్లో కరోనా వైరస్ ప్రభావం ఎంతలా అల్లకల్లోల పరిస్థితుల సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.  భారత్ లో ఒక రేంజ్ లో కేసులు పెరిగిపోవడంతో అందరూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతికేవారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇప్పుడు మూడవ దశ ముంచుకు వచ్చేస్తుంది. ప్రస్తుతం రోజుకు కేసులు పెరుగుతూ ఉండడం చూసుకుంటే దాదాపు భారత్లో మూడవ దశ ప్రారంభం అయ్యింది అని నిపుణులు  కూడా అంచనా వేస్తూ ఉండడం గమనార్హం. అదే సమయంలో సౌతాఫ్రికాలో వెలుగులోకి వచ్చిన ఓమిక్రాన్ వేరియంట్ అందరినీ భయపెడుతుంది. చాప కింద నీరులా దేశాలకు పాకి పోతుంది.

 అయితే మొన్నటి వరకు భారత్ లో అతి తక్కువ కేసులు నమోదు అయ్యాయి అని అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఎప్పుడు ప్రతిరోజు దాదాపు రెండు లక్షల వరకు కేసు నమోదు అవుతూ ఉండడంతో అందులో మరింత భయం పట్టుకుంది. ఈ క్రమంలోనే  వైరస్ వెలుగులోకి వచ్చి ఇన్ని రోజులు గడుస్తున్న ఇప్పటికీ ఎంతోమంది సరైన అవగాహన లేకపోవడంతో అనవసర భయాందోళనలకు గురవుతున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది అని తెలియక ఎంతోమంది  వైరస్ భయంతో ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది.

 ప్రస్తుతం వెలుగులోకి వచ్చిన కొత్త వేరియంట్ ప్రమాదకారి కాదని కూడా తక్కువే అంటూ వైద్యనిపుణులు ఎప్పటికప్పుడు ధైర్యం నింపుతున్నారు. కానీ కొంతమంది మాత్రం ఇప్పటికీ ఎంతో భయాందోళనలో మునిగిపోతున్నారు. ఇటీవల తమిళనాడులో  కరోనా వైరస్ సోకుతుంది ఏమో అని భయంతో తల్లి కొడుకు ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా  మారిపోయింది. మధురై ఎంజీఆర్ కాలనీలో నివాసం ఉంటున్న జ్యోతిక అనే మహిళకు నాలుగు రోజుల క్రితం జ్వరం వచ్చింది. దీంతో కరోనా వైరస్ సోకింది ఏమో అని భయాందోళనకు గురైంది. దీంతో ఇక కుటుంబం మొత్తం కూడా విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనలో తల్లి మృతి చెందగా మరో నలుగురు కుటుంబసభ్యులు బయటపడినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: