మిస్డ్ కాల్ వచ్చింది.. 46 లక్షలు పోయాయి?

praveen
ప్రస్తుతం టెక్నాలజీ పెరిగిపోతుంది. ఈ క్రమంలోనే ఏదైనా కావాలంటే ఎక్కడికో వెళ్లాల్సిన పనిలేదు. అర చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ నుండి అన్ని రకాల  పనులు చేసుకోవడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఆర్థిక పరమైన లావాదేవీలు జరుపుకోవడానికి ప్రస్తుతం ఎన్నో ఆన్లైన్ పేమెంట్ యాప్స్ అందుబాటులో ఉన్నాయ్ అన్న విషయం తెలిసిందే. అయితే టెక్నాలజీ పెరిగిపోవడం వల్ల లాభాలతో పాటు నష్టాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి.  సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతూ ఎంతో మంది ఖాతాలు ఖాళీ చేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఏకంగా ఒక మిస్డ్ కాల్   తో బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు మొత్తం ఉడ్చేస్తున్నారు ఎంతోమంది కేటుగాళ్లు.

 ఇటీవల అహ్మదాబాద్ లో కూడా ఇలాంటి తరహా ఘటన జరిగింది.. శాటిలైట్ ఎక్స్టెన్షన్  లో జీవనం సాగిస్తున్నాడు రాకేశ్ అనే ఒక వ్యాపారి.  ఇకపోతే ఇటీవలే రాకేష్ కు గుర్తు తెలియని నెంబర్ నుంచి ఒక మిస్డ్ కాల్ వచ్చింది. ఇక మిస్డ్ కాల్ వచ్చిన తర్వాత వెంటనే మొబైల్లో సిగ్నల్స్ లేకపోవడం సిమ్ కార్డు బ్లాక్ అవ్వడం జరిగింది. దీంతో తన సిమ్ కార్డు పనిచేయడం లేదని నెట్వర్కు కస్టమర్ కేర్ కి కాల్ చేశాడు. నాలుగు గంటల్లో సిమ్ యాక్టివేట్ అవుతాయి అని సదరు నెట్వర్క్ కస్టమర్ కేర్ సభ్యులు తెలిపారు. ఇక ఆ తర్వాత రాత్రి 10 గంటల సమయంలో మొబైల్ స్విచ్ఛాఫ్ అయిందని కంపెనీకి ఫిర్యాదు చేయగా ఆ తర్వాత సిమ్ యాక్టివేషన్ చేసే సమయంలో రెండు సిమ్ కార్డు బ్లాక్ అయినట్లు గుర్తించాడు.

 ఇక ఆ తర్వాత రాకేష్ ఫోన్ చెక్ చేసిన స్టోర్ ప్రతినిధులు కోల్కతాలో సిమ్ కార్డు బ్లాక్ చేసినట్లు గుర్తించారు. రాకేష్ అనుమతి లేకుండానే బ్యాంకు ట్రాన్సాక్షన్ లు జరిగినట్లు అనుమానించాడు. ఇక బ్యాంకు ను సంప్రదించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఏకంగా ఒక మిస్సేడ్ కాల్ తో 46 లక్షలు కాచేయడంతో కంగుతిన్నాడు రాకేష్. వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రస్తుతం సైబర్ నేరగాళ్ల ను పట్టుకునే పనిలో పడ్డారు. దాదాపు 11 ట్రాన్సాక్షన్స్ ద్వారా 46. 36 లక్షల రూపాయలు విత్డ్రా అయినట్లు గుర్తించాడు రాకేష్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: