కొత్త ట్విస్ట్ : పాల్వంచ ఘ‌ట‌న‌లో వనమా రాఘవ దొరకలేదట‌..!

N ANJANEYULU
తొలుత ఇవాళ  భ‌ద్రాద్రి కొత్తగూడెం ఎమ్మెల్యే వ‌న‌మా వెంక‌టేశ్వ‌ర‌రావు కుమారుడు రాఘవేంద్ర‌రావు అరెస్ట్ అయ్యార‌ని మీడియాల్లో ప‌లు క‌థనాలు కూడా వెలువ‌డ్డాయి. కానీ తాజాగా పోలీసులు ట్విస్ట్ ఇచ్చారు. అయితే వ‌న‌మా రాఘ‌వేంద్ర‌రావును అరెస్ట్ చేసిన‌ట్టు వ‌చ్చిన వార్త‌లు నిజం కాదు అని పోలీసులు వెల్ల‌డించారు. వ‌న‌మా రాఘ‌వ త‌మ‌కు దొర‌క‌లేదు అని కొత్త‌గూడెం ఏఎస్పీ రోహిత్‌రాజ్ పేర్కొన్నారు. అత‌ని కోసం తెలుగు రాష్ట్రాల‌లో గాలిస్తున్న‌ట్టు వెల్ల‌డించారు. రాఘ‌వ‌పై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌కు సంబంధించి ఆధారాలు ల‌భిస్తే రౌడీషీట్ న‌మోదు చేస్తాం అని చెప్పారు. గ‌తంలో న‌మోదు అయిన కేసుల‌పై ద‌ర్యాప్తు చేస్తామ‌ని వివ‌రించారు.

రాఘ‌వ కోసం ఏనిమిది బృందాలు తెలంగాణ‌, ఏపీలో గాలిస్తున్నాయి. త్వ‌ర‌లోనే రాఘ‌వ‌ను పోలీస్ క‌స్ట‌డిలోకి తీసుకుంటాం. గ‌తంలో న‌మోదైన కేసుల ఆధారంగా కూడా ద‌ర్యాప్తు చేప‌డుతున్నాం. పాల్వంచ‌లో రామ‌కృష్ణ కుటుంబం ఆత్మ‌హ‌త్య వ్య‌వ‌హారంలో8 అత‌ని సెల్పీ వీడియో సంచ‌ల‌నం అయింది. ఆత్మ‌హ‌త్య‌కు ముందు రామ‌కృష్ణ సెల్పీ వీడియో తీసుకున్నారు. ఆత్మ‌హ‌త్య నిర్ణ‌యానికి దారి తీసిన ప‌రిస్థితుల‌ను వివ‌రించారు. ఆ వీడియోలో ఎమ్మెల్యే వ‌న‌మా వెంక‌టేశ్వ‌ర‌రావు కుమారుడు రాఘ‌వేంద్ర‌రావు పై రామ‌కృష్ణ తీవ్ర ఆరోప‌ణ‌లు చేసారు.

ముఖ్యంగా రాఘ‌వ కార‌ణంగా ఎన్నో కుటుంబాలు నాశ‌నం అయ్యాయి. అలాంటి దుర్మార్గుల‌ను రాజ‌కీయంగా ఎద‌గ‌నివ్వ‌వ‌ద్దు. డ‌బ్బు రూపంలో అడిగినా ఇచ్చేవాడిని. ఏ భ‌ర్త కూడా విన‌కూడ‌ని మాట‌ను రాఘ‌వ అడిగారు. నాభార్య‌ను హైద‌రాబాద్ తీసుకురావాల‌ని కోరారు. రాజ‌కీయ‌, ఆర్థిక బ‌లంతో ప‌బ్బం గ‌డుపుకోవాల‌ని చూసారు. నేను ఒక్క‌డినే వెళ్లిపోతే నా భార్య‌, పిల్ల‌ల‌ను వ‌దిలిపెట్ట‌రు. అందుకే నాతో పాటు వారినీ తీసుకెళ్లుతున్నా.  అప్పుల్లో ఉన్న నాపై నా త‌ల్లి సోద‌రి క‌క్ష సాధించారు అని నాగ‌రామ‌కృష్ణ సెల్పీ వీడియోలో చెప్పారు.

మ‌రోవైపు 40 రోజులుగా ఆరోగ్య స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న త‌న‌కు ఈ ఘ‌ట‌న మ‌నోవేద‌న‌కు గురి చేసిన‌ద‌ని ఎమ్మెల్యే వెంక‌టేశ్వ‌ర‌రావు తెలిపారు. త‌న కుమారుడు పాత్ర ఉంద‌ని వ‌స్తున్న వార్త‌ల‌తో మ‌రింత క్షోభ‌కు గుర‌వుతున్నాన‌ని, పోలీసులు కేసు న‌మోదు చేసార‌ని, విచార‌ణ‌కు పూర్తిగా స‌హ‌క‌రిస్తామ‌ని వెల్ల‌డించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: