చీర వివాదం పై అనసూయ సాలిడ్ కౌంటర్..!

Divya
టాలీవుడ్ లో యాంకర్ గా తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్న అనసూయ ఆ తర్వాత అదే క్రేజీతో పలు సినిమాలలో నటిగా నటించి తనకంటూ ఒక గుర్తింపు అందుకుంది. అయితే అనసూయ మాత్రం ఎలాంటి విషయాలనైనా సరే నిర్మొహమాటం లేకుండా చెప్పేస్తుంది. గడచిన కొద్ది నెలల క్రితం మహిళలల వస్త్రధారణ పైన నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఈ విషయం పైన నటి అనసూయ కూడా తనదైన సైజులో కౌంటర్ వేసింది. అయితే ఈ విషయం అర్ధం మునిగినప్పటికీ ఇటీవల కుటుంబంతో కలిసి అనసూయ గుడికి వెళ్ళగా అక్కడ చీరలో కనిపిస్తూ సోషల్ మీడియాలో ఒక వీడియోని షేర్ చేసింది.


ఈ విషయం మీద కూడా చాలామంది నెటిజెన్స్ అనసూయను వక్రీకరిస్తూ.. శివాజీ భయానికి అనసూయ ఇలా మారిపోయింది అంటూ చాలా కామెంట్స్ చేశారు. తనపై వస్తున్న ఇలాంటి వార్తలను అనసూయ తిప్పికొట్టింది. శివాజీ సృష్టించిన చీరను అనసూయ ధరించిందని థంబ్ నెయిల్ పెట్టుకుంటే బాగుంటుందని, తాము గతంలో ఎప్పుడూ కూడా చీరలు కట్టుకోనట్లుగా కొంతమంది ప్రవర్తిస్తూ ఉండడం చూసి నవ్వువోస్తోంది. ఏదైనా ప్రచారం చేసే ముందు అసలు నిజాలు తెలుసుకోవాలంటు తెలియజేసింది. సాధారణంగా పండుగలు, గుడి సందర్భాల సమయంలో తాను ఎప్పుడు కూడా సాంప్రదాయంగానే కనిపిస్తానంటూ మరొకసారి గుర్తు చేశారు.


ఇందుకు సంబంధించిన ట్విట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గతంలో కూడా అనసూయ ఎన్నో సందర్భాలలో చీరకట్టులో కనిపించిన ఫోటోలు చూసే ఉన్నాము. వస్త్రధారణ అనేది వ్యక్తిగత ఇష్టమని దానిని ఎవరు కూడా మరొకరి వ్యాఖ్యలతో ముడి పెట్టడం సరికాదు అంటూ అనసూయ అభిమానులు కూడా అభిప్రాయపడుతూ మద్దతు నిలుస్తున్నారు. గత కొద్ది నెలలుగా శివాజీ హీరోయిన్స్ డ్రెస్సింగ్ పైన చేసిన కామెంట్స్ గురించి ఎవరూ కూడా మాట్లాడుకోవడం లేదు. ఇప్పుడు మరొకసారి అనసూయ చేసిన ఈ కామెంట్స్ వల్ల ఇప్పుడు చర్చ జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: