విశాఖ : విహార యాత్ర‌లో విషాదం.. ఐదుగురు గ‌ల్లంతు..!

N ANJANEYULU
సండే క‌దా అని స‌ర‌దాగా గ‌డుప‌వ‌చ్చ‌ని విహార యాత్ర‌కు వ‌చ్చిన యువ‌కుల కుటుంబాల్లో స‌ముద్ర స్నానం తీర‌ని విషాదం మిగిల్చింది. పిక్నిక్ కోస‌మంటూ ఆర్‌.కే.బీచ్‌కు వ‌చ్చి ఐదుగురు స‌ముద్రంలో గ‌ల్లంత‌య్యారు. ఇద్ద‌రినీ ఒడ్డుకు కొట్టుకు రాగా.. ముగ్గురు గ‌ల్లంతు అయ్యారు. ఇద్ద‌రు మృతి చెందారు. అయితే మృతి చెందిన వారిలో ఒక యువ‌తి కూడా ఉంది. విశాఖ‌ప‌ట్ట‌ణంలోని ఆర్‌.కే.బీచ్‌లో విషాద ఘ‌ట‌న చోటు చేసుకున్న‌ది. వేర్వేరు రాష్ట్రాల నుంచి వ‌చ్చిన వారిలో ఇద్ద‌రు మృతి చెంద‌గా.. ముగ్గురు గ‌ల్లంతైన సంఘ‌ట‌న తీవ్ర క‌ల‌క‌లం సృష్టిస్తోంది.
ఒడిషా భ‌ద్ర‌క్ జిల్లాకు చెందిన ఐదురుగు ప‌ర్యాట‌కులు విశాఖ ఆర్‌.కె.బీచ్‌కొచ్చారు. అందులోకి దిగిన ఐదుగురు ఒక్క‌సారిగా గ‌ల్లంతు అయ్యారు. విహార యాత్ర కోసం ఆదివారం మ‌ధ్యాహ్నం ఒడిశాకు చెందిన న‌లుగురు యువ‌కులు, ఓ యువ‌తి న‌గ‌రానికి వ‌చ్చారు. బీచ్‌లో స‌ర‌దాగా గ‌డిపారు. త‌రువాత స్నానానికి దిగి అల‌ల ధాటికీ కొట్టుకుపోయారు. ఘ‌ట‌న జ‌రిగిన అర‌గంట‌లోనే యువ‌తి, యువ‌కుడి మృత‌దేహాలు ఒడ్డుకు కొట్టుకు వ‌చ్చాయి. మ‌రొక ముగ్గురి కోసం అధికారులు గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు.
గ‌జ ఈత‌గాళ్లు, లైఫ్ గార్డ్స్‌ను తీసుకొచ్చి గాలింపు మొద‌లు పెట్టారు. మూడ‌వ ప‌ట్ట‌ణ సీఐ కోరాడ రామారావు నేవి, మెరైన్ సిబ్బందికి స‌మాచారం చేర‌వేసారు. గ‌ల్లంతు అయిన వారి కోసం స్పీడ్ బోట్లు, హెలికాప్ట‌ర్ ద్వారా గాలించే అవ‌కాశం ఉన్న‌ది. ఒడ్డుకొచ్చిన మృత‌దేహాల‌ను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు త‌ర‌లించారు. వీరంద‌రూ న్యూ ఇయ‌ర్ వేడుక‌లు జ‌రుపుకోవ‌డానికి వ‌చ్చిన‌ట్టు తెలుస్తుంది. బీచ్‌లోకి ఇత‌రుల‌ను దిగ‌నివ్వ‌కుండా పోలీసులు ప‌హారా కాస్తున్నారు.  
 నూత‌న సంవ‌త్స‌ర వేడుక‌ల కోసం డిసెంబ‌ర్ 30న హైద‌రాబాద్ నుంచి విశాఖ‌కు యువ‌కులు వెళ్లారు. విహార‌యాత్ర కోసం వెళ్లిన మిత్ర‌బృందం 8 మంది స‌ముద్రంలో స్నానం చేయ‌డానికీ దిగారు. ముగ్గురు గ‌ల్లంతు కాగా.. ఐదుగురు సుర‌క్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. గ‌ల్లంతు అయిన వారిలో శివ అనే యువ‌కుడు మృతి చెంద‌గా.. అజీజ్‌, శివ‌కుమార్ అనే ఇద్ద‌రు యువ‌కుల ఆచూకి ల‌భించ‌లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: