సాయం చేసే గుణమే.. ప్రాణం తీసిందే?

praveen
నూతన సంవత్సరం వచ్చింది అంటే చాలు చిన్నలు పెద్దలు అనే తేడా లేకుండా ప్రతిఒకరు కొత్త సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలుకుతూ మునుపెన్నడూ లేని విధంగా వేడుకలు చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇక న్యూ ఇయర్ వేడుకల్లో అప్పుడు ఎక్కువమంది మద్యం తాగడం లాంటివి చేస్తూ ఉంటారు. అయితే మద్యం తాగి వాహనం నడపడం కారణంగా కొత్త సంవత్సరంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు కూడా ఏర్పడుతుంటాయి. ఇలా కొత్త సంవత్సరం వచ్చిందని ఆనందపడే తల్లిదండ్రులకు పిల్లలు చేసే చిన్నపాటి పొరపాట్లు ఏకంగా కడుపుకోత మిగులుస్తున్నాయ్. ఇక్కడ ఇలాంటిదే జరిగింది.

 కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టిన ఆ యువకుడు జీవితాల్లో వెలుగులు నింపూ కోవాలి అని అనుకున్నాడు కానీ ఇంత తొందరగా జీవితం చీకట్లో మునిగి పోతుంది అని మాత్రం ఊహించలేకపోయాడు. ఎదుటి వ్యక్తి విషయంలో మానవత్వాన్ని జాలి దయాగుణాన్ని ప్రదర్శించడమే అతనికి ప్రాణాలు పోవడానికి కారణం అయింది. చివరికి తల్లిదండ్రులకు కడుపుకోత మిగిలింది. సాయం చేయడానికి వెళ్లిన ఓ యువకుడు కాలు జారి పడి బావిలో పడి మృతి చెందాడు. యాదాద్రి భువనగిరి జిల్లా బిబినగర్ మండలం లో వెలుగులోకి వచ్చింది వచ్చింది ఈ ఘటన. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం వెంకటాపురం కు చెందిన శ్రీనివాస్ మంగమ్మా దంపతులు నాచారం డివిజన్ పరిధిలోని మల్లాపూర్ ఇంద్రమ్మ కాలనీలో నివాసం ఉంటున్నారు

 వీరికి 21 ఏళ్ల కుమారుడు రమేష్ కూడా ఉన్నాడు. ఇకపోతే ఇటీవల తెల్లవారుజామున ద్విచక్ర వాహనంపై రమేష్ తన స్నేహితులతో కలిసి యాదాద్రి కి బయలుదేరారు. ఇక మధ్యలో ఒక చోట టీ తాగడానికి వాహనం ఆపాడు రమేష్. పక్కనే ఎవరో యువకుల మధ్య గొడవ జరిగింది. భువనగిరికి చెందిన యువకులు ద్విచక్ర వాహనం లో పెట్రోల్ అయిపోయింది. ఇబ్బంది పడుతున్న సమయంలో గొడవ విషయం తెలియని రమేష్ తన మిత్రులతో కలిసి సహాయం చేస్తున్న సమయంలో గూడూరు వాసులు  కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఇక తప్పించుకునే క్రమంలో రమేష్ వ్యవసాయ బావిలో పడి పోయాడు ఆ తర్వాత స్నేహితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆరు గంటల తర్వాత రమేష్ మృతదేహానికి బయటకు తీసి  కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: