అయ్యాయో.. పోలీసులకు ఎంత కష్టం.. న్యూ ఇయర్ పార్టీ కోసం?

praveen
న్యూ ఇయర్ వచ్చిందంటే చాలు వేడుకలు ఎంత ఘనంగా చేసుకోవడానికి అందరూ ఇష్టపడతారన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మందు విందు చిందు అంటూ తెగ ఎంజాయ్ చేయడానికిప్రయత్నిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇక న్యూ ఇయర్ రోజు ఫుల్లుగా పార్టీ చేసుకోవడానికి కొన్ని రోజుల ముందు నుంచే ప్లాన్ చేసుకోవడం చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఇక న్యూ ఇయర్ పార్టీ కోసం ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టడం వంటివి కూడా చేస్తూ వుంటారు చాలామంది. సాధారణంగా న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుంటూ ఉంటే ఎక్కడ అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గస్తీ కాస్తూ ఉంటారు.

 న్యూ ఇయర్ సమయంలో దాదాపు అందరు పోలీసులు ఇలా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎక్కడికక్కడ నిఘా ఏర్పాటు చేస్తారు అని చెప్పాలి. కానీ ఇక్కడ మాత్రం పోలీసులు కాస్త విచిత్రంగా ప్రవర్తించారు.  న్యూ ఇయర్ పార్టీ చేసుకోవాలని అనుకున్నారు పోలీసులు. కానీ దీనికోసం ముందుగా ఎలాంటి ప్లాన్ వేసుకోలేదేమో ఏమో.. చివరికి చేయకూడని పని చేసేశారు. ఖాకీ డ్రెస్ లో ఉండి ఏకంగా దొంగ గా మారిపోయారు పోలీసులు. న్యూ ఇయర్ పార్టీ కోసం మేకలను దొంగలించడం చేసారు. ఇది స్థానికంగా హాట్ టాపిక్ గా మారిపోయింది. ఒడిశాలో వెలుగులోకి వచ్చింది ఈ ఘటన.

 న్యూ ఇయర్  పార్టీని ఘనంగా చేసు కోవాలి అనుకోవడం పర్వాలేదు. కానీ ఇలా మేకలను దొంగ దొంగలించాలి అనుకోవడమే ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది  బొలంగిర్ జిల్లా సిండికేట గ్రామంలో ఒక వ్యక్తికి చెందిన మేకల మందలో రెండు మేకలు  కనిపించకపోవడంతో కంగారు పడ్డాడు  ఈ క్రమంలోనే పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్ళాడు. అయితే ఇక పోలీస్ స్టేషన్ వెనుక పోలీసులు దొంగిలించిన మేకలను కోయటం చూసి ఒక్కసారిగా అవాక్కయ్యాడు మేకల యజమాని.  ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయగా ఏకంగా అతన్ని బెదిరించారు పోలీసులు.  చివరికి ఈ విషయం ఎస్పీ నితిన్ దృష్టికి వెళ్లడంతో ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని సమగ్ర విచారణ జరిపిస్తాము అంటూ హామీ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: