80 ఏళ్ళ వృద్ధుడికి కోరిక.. వయాగ్రా వేసుకున్నాడు.. చివరికి?
కాని చివరిలో భార్య ట్విస్ట్ ఇచ్చింది. శృంగారం చేయడానికి నిరాకరించింది.. దీంతో చిర్రెత్తిన పోయిన భర్త పడకమంచం పైనే భార్యను దారుణంగా హత్య చేశాడు. వివరాల్లోకి వెళితే 80 ఏళ్ళ వీటో కాంగీని 61 ఏళ్ల నాటాలియా భార్యాభర్తలు. భార్య కంటే భర్త 20 ఏళ్లు ఎక్కువగా ఉన్నప్పటికీ వీరి దాంపత్య జీవితం మాత్రం ఎంతో అన్యోన్యంగానే సాగి పోయింది అని చెప్పాలి. పెళ్లి అయిన నాటి నుంచి అన్యోన్య దంపతులుగా ఉన్న వీరి మధ్య ఇలాంటి ఘటన జరుగుతుంది అని మాత్రం ఎవరూ ఊహించలేదు అని చెప్పాలి.. ఇటీవలే క్రిస్మస్ పండుగ సందర్భంగా అందరిలాగానే వీరు పండుగలు సెలబ్రేట్ చేసుకున్నారు.
ఈ క్రమంలోనే భార్యతో ఎంతో ఆనందంగా ఉండాలని భావించిన భర్త ఆమెతో శృంగారంలో పాల్గొనాలి అని అనుకున్నాడు. వయాగ్రా టాబ్లెట్ వేసుకుని కాసేపటికి భార్య దగ్గరికి వెళ్లి శృంగారం చేయాలని అనుకున్నాడు. కానీ భార్య మాత్రం శృంగారం చేయడానికి నిరాకరించింది. ఎంత బతిమిలాడినా ఒప్పుకోలేదు. దీంతో భర్త కోపంతో ఊగిపోయాడు కట్టుకున్న భార్య అని కూడా ఆలోచన లేకుండా విచక్షణ కోల్పోయి దారుణంగా కత్తితో పొడిచాడు. దీంతో సదరు మహిళ అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. భార్య శవాన్ని నేలపై విసిరేసి రాత్రి మంచంపై ప్రశాంతంగా పడుకున్నాడు. పక్కింటి వ్యక్తి ఈ విషయాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో రంగం లోకి దిగిన పోలీసులు డెడ్ బాడీని స్వాధీనం చేసుకుని ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసిన భర్త అదుపులోకి తీసుకున్నారు.. పోలీసు విచారణలో ఎందుకు భార్యను చంపావ్ అని ప్రశ్నించడంతో అసలు విషయాన్ని ఒప్పుకున్నాడు భర్త.