దారుణం : 15 ఏళ్ల బాలికపై అత్యాచారం.. ఎంతమంది అంటే.?
వివరాల్లోకి వెళితే.. ధార్వాడ్ జిల్లాలో నివాసం ఉండే 15 ఏళ్ల మైనర్ బాలిక పదవతరగతి చదువుతుంది. నిత్యం పాఠశాలకు వెళ్లి వస్తుండగా ఆమెకు మార్గ మధ్యంలో 17 ఏళ్ల వయసున్న ఆరుగురు కళాశాల యువకులు పరిచయం అయ్యారు. తమను తాము పరిచయం చేసుకున్న యువకులు తరుచూ బాలికతో మాట్లాడుతుండేవారు. అలా జరుగుతున్నా క్రమంలో ఉన్నట్టుండి ఒకరోజు బాలికను ఆ యువకులు నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్లి అత్యాచారానికి ఒడిగట్టారు.
అనంతరం ఆ దృశ్యాలను మొబైల్ కెమెరాలో బంధించడంతో పాటు.. ఈ విషయం ఎవరికైనా చెబితే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని కూడా బెదిరించారు. ఆ వీడియోలను అడ్డం పెట్టుకొని మూడు నెలలలో ఆరుగురు, ఆరు చోట్ల బాలికపై పదేపదే అత్యాచారానికి పాల్పడ్డారు. ఇక వారి వేధింపులు తట్టుకోలేని బాలిక ఇంట్లో తల్లిదండ్రులకు జరిగిన విషయం చెప్పినది. ఆ విషయం విన్న వెంటనే బాలికను తీసుకొని తండ్రి పోలీసుల వద్దకు చేరుకొని ఫిర్యాదు చేసాడు.
డిసెంబర్ 26న ఈ ఘటనపై బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ధార్వాడ్ జిల్లా లక్ష్మీసింగింకేరిలో ఆరుగులు అబ్బాయిలను అదుపులోకి తీసుకుని, వారి వద్ద ఉన్న మొబైల్లలో వీడియోలను డిలీట్ చేసారు. ఆ మైనర్ బాలికను వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆధ్వర్యంలో ఈ ఘటనపై స్పెషల్ టీం దర్యాప్తు చేస్తోంది. ఈ దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్టు సమాచారం. బాలికను రేప్ చేస్తుండగా తీసిన వీడియోలు ఇంటర్నెట్లో అప్లోడ్ చేసి.. డబ్బు సంపాదించాలని నిందితులు భావించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడి అయింది. ప్రస్తుతం ఈ ఆరుగురు నిందితులు జ్యూడిషియల్ కస్టడిలో ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు.