మరీ ఇంత దారుణమా.. ఉమ్మి నాకించాడు?

praveen
సాధారణంగా ఎన్నికలు వచ్చాయి అంటే చాలు ఇక నాయకులందరూ ప్రజల్లోకి వచ్చేస్తూ ఉంటారు. అప్పుడు వరకు ప్రజల సమస్యలను పరిష్కరించాలని కోరినా కూడా పట్టించుకోని నాయకులందరూ మేము ప్రజల మనిషులం.. మీ కోసమే బ్రతుకుతున్నాం అంటూ ఎన్నో మాటలు చెబుతూ ఉంటారు. అంతేకాదు ఓటర్లను ఏదో ఒక విధంగా ఆకట్టుకోవడానికి సర్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. పంచాయతీ ఎన్నికల నుంచి మొదలు పెడితే పార్లమెంటు ఎన్నికల వరకు కూడా ఇలా ఎన్నికలు వచ్చినప్పుడల్లా నాయకులు ప్రజల్లోకి రావడం వింతైన హామీలు కురిపించడం లాంటివి చేస్తూ ఉంటారు.



 అయితే ఇక ప్రజలను ఆకర్షించడానికి భారీగా ర్యాలీలు నిర్వహించడం భారీ సభలు ఏర్పాటు చేయడం చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు నాయకులు ఇలా ప్రచారంలో భాగంగా ర్యాలీ నిర్వహిస్తున్న సమయంలో ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చి చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి. నీకు ఓటు వేసే ప్రసక్తే లేదు అంటూ కొన్నిసార్లు ప్రజలు ఏకంగా నాయకుల ముఖం మీదే చెబుతూ ఉంటారు. అయితే ఇలా ప్రజలు చెప్పినప్పటికీ ఏదో ఒకటి చెబుతూ అక్కడి నుంచి వెళ్ళి పోతూ  ఉంటారు నాయకులు. ఇక్కడ ఇలాంటి ఘటనే జరిగింది. పంచాయతీ ఎన్నికల్లో ప్రచారం నిర్వహిస్తున్న అభ్యర్థి మాకే ఓటు వేయాలి అంటూ ఇద్దరు యువకులకు కోరాడు.


 అయితే ఓటు వేసే ప్రసక్తి లేదు అంటూ ఆ యువకుడు చెప్పడంతో చివరికి అమానవీయంగా ప్రవర్తించాడు సదరు వ్యక్తి.  ఏకంగా ఇద్దరు యువకులతో ఉమ్మిని నాకించాడు. ఘటన ఈ ఘటన బీహార్లోని సింఘానా లో వెలుగులోకి వచ్చింది. పంచాయతీ ఎన్నికలలో భాగంగా సింఘానా సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు బల్వంత్ సింగ్. ఓటు వేయాలని ఇద్దరు యువకులను అభ్యర్థించగా వారు నిరాకరించడంతో కోపంతో రగిలిపోయాడు. వారితో నేలపై ఉన్న ఉమ్మిని నాకించాడు. ఈ ఘటన సంచలనంగా మారగా.. జిల్లా కోర్టు జడ్జి, జిల్లా ఎస్పీ తీవ్రంగా స్పందించారు. పోలీసులు అతన్ని అరెస్టు చేసికటకటాల వెనక్కి తోశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: