షాకింగ్ : ప్రియుడే హంతకుడు?

praveen
ఒకప్పుడుప్రేమ కారణంగా ఎన్నో ప్రాణాలు పోయేవి.. ప్రేమించిన వ్యక్తి దూరం అయ్యాడని.. లేదా ప్రేమించిన వ్యక్తి మోసం చేశాడని ఎంతోమంది మనస్థాపం చెంది బాధతో ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకునేవారు. నేటి రోజుల్లో కూడా ప్రేమ కారణంగా ప్రాణాలు పోతున్నాయి.. ప్రాణం కంటే ప్రేమించిన వ్యక్తి దూరం అయ్యాడు అని ప్రాణాలు తీసుకోవడం లేదు. ఏకంగా ప్రేమించిన వ్యక్తే దారుణంగా హత్యకు పాల్పడిన ఘటనలు వెలుగులోకి వస్తున్నాయ్. ఇటీవలి కాలంలో రెచ్చిపోతున్న ప్రేమోన్మాదులు దారుణలకు పాల్పడుతున్నారు. చిన్నచిన్న కారణాలకే దారుణంగా హత్య చేసిన ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి.


ప్రేమ పెళ్లి అంటూ వెంట పడటం.. ఇక ఆ తర్వాత ఏదో ఒక చిన్న కారణం చెప్పి దారుణంగా హత్య చేయడం లాంటివి చేస్తున్నారు. ఒక మనిషిని హత్య చేస్తే జైలులో ఊచలు లెక్క పెట్టాల్సి వస్తుందని కోర్టులు కఠిన శిక్షలు విధిస్థాయి అన్న భయం ఎవ్వరిలో కనిపించడం లేదు. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రేమ అంటూ ఆ యువకుడు వెంటపడ్డాడు.. నువ్వు లేకుండా అసలు బ్రతకలేను అంటూ మాయమాటలు చెప్పాడు.. నువ్వు లేని జీవితం వృధా అంటూ ఎన్నో కల్లబొల్లి మాటలతో నమ్మించాడు. అతని మాటలు నమ్మి ప్రేమను అంగీకరించింది యువతీ. కొన్నాళ్లపాటు వీరిద్దరూ ప్రేమలో కొనసాగారు.


 అయితే ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను అంటూ చెప్పిన ఆ ప్రియుడే చివరికి యమకింకరుడు గా మారిపోయాడు. ప్రేమించిన ప్రియురాలిని దారుణంగా హత్యచేశాడు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖని లోని 8ఇంక్లైన్ లో చోటు చేసుకుంది. ఓ యువతిని ప్రియుడు దారుణంగా హత్యచేశాడు  పదునైన ఆయుధాలతో దాడి చేసి యువతి గొంతు కోసి హతమార్చాడు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: