ఇంట్లోనే దుకాణం పెట్టారు.. డోర్ తెరిచి పోలీసులు షాక్?

praveen
క్రికెట్ ఆట కి ఇండియా లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండియాలో ఎన్నో రకాల ఆటలు ఉన్నప్పటికీ క్రికెట్ కి మాత్రమే ఎక్కువ ఆదరణ ఉంటుంది. క్రికెట్ మ్యాచ్ వస్తుంది అంటే చాలు టీవీలకు అతుక్కుపోయి మరి మ్యాచ్ వీక్షిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే భారత్లో అటు క్రికెట్ ఆటకు ఎక్కువగా క్రేజ్ ఉండటంతో అటు బెట్టింగ్ రాయుళ్లు  కూడా రెచ్చిపోతుంటారు. క్రికెట్ మ్యాచ్ వస్తుంది అంటే చాలు కాయ్ రాజా కాయ్ అంటూ భారీగా బెట్టింగ్ లు పెడుతూ ఉంటారు. కొంతమంది ముఠాగా ఏర్పడి ఇక బెట్టింగ్ దందాను నడిపిస్తూ ఉంటారు.

 అయితే బెట్టింగ్ లకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించినప్పటికీ మాత్రం ఎవరిలో మార్పు రాదు. అయితే ప్రస్తుతం టి20 వరల్డ్ కప్ జరుగుతుంది అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బెట్టింగ్ రాయళ్లు మరోసారి రెచ్చిపోతున్నారు. పోలీసులకు తెలియకుండా గుట్టుగా బెట్టింగ్ దందా నడిపిస్తున్నారు. పోలీసులు కూడా బెట్టింగ్ ముఠా లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తూ ఎంతో మంది గుట్టురట్టు చేస్తున్నారు.ఇక ఇటీవల గుంటూరులో కూడా ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. గుంటూరులో బెట్టింగ్ దందా ను రహస్యంగా నిర్వహిస్తున్న ముగ్గురు ముఠా సభ్యులను అరెస్టు చేశారు పోలీసులు.ఈ ఘటన స్థానికంగా హాట్ టాపిక్ గా మారిపోయింది.

వివరాల్లోకి వెళితే.. గుంటూరు ఎస్పీ ఆదేశాలతో బెట్టింగ్ రాయుళ్ల ఆట కట్టడానికి పోలీసులు పలు బృందాలుగా ఏర్పడి అన్ని ప్రాంతాలలో కూడా జల్లెడ పట్టారు. ఈ క్రమంలోనే పోలీసులకు తెలియకుండా గుంటూరులో రహస్యంగా బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే నిందితులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడానికి పోలీసులు ఇంటి చుట్టుముట్టారు. ఇక ఆ తర్వాత తెరిచి చూసి ఒక్కసారిగా షాకయ్యారు. ఆ ఇంట్లో ఉన్న ముగ్గురు వ్యక్తులు ఆన్లైన్ ద్వారా బెట్టి నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఈక్రమంలోనే షేక్ రియాజ్ షేక్, సిరాజుద్దీన్ , పవన్ కుమార్ లను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: