ఛీ ఛీ.. కన్న తండ్రి ఎంత నీచం?

praveen
మానవత్వం ఉన్న  మనుషులు రోజు రోజుకి క్రూరమృగాల కంటే దారుణంగా ప్రవర్తిస్తున్నారు  అడవిలో ఉండే క్రూరమృగాలైన సొంత పిల్లల విషయంలో కాస్త జాలి దయ చూపిస్తాయేమో కానీ సభ్య సమాజంలో బ్రతుకుతున్న మనుషులు మాత్రం సొంత పిల్లల విషయంలోనే ఈ దారుణం గా వ్యవహరిస్తున్న తీరు సభ్యసమాజాన్ని సిగ్గు పడేలా చేస్తుంది. మానవత్వానికి కేరాఫ్ అడ్రస్ అయిన మనుషులు..ఆ మానవత్వం అనే పదానికి ఆమడదూరంలో పరుగులు పెడుతున్నారు. అయితే ఇటీవలి కాలంలో మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి అన్న విషయం తెలిసిందే.


 మొన్నటి వరకు కేవలం బయట వ్యక్తుల నుంచి మాత్రమే లైంగిక వేధింపులు ఎదుర్కొనే వారు ఆడపిల్లలు. కానీ ఇటీవలి కాలంలో మాత్రం ఏకంగా సొంత వారి నుంచి లైంగిక వేధింపులు ఎదురవుతున్నాయి. దాంతో ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో పడిపోతున్నారు. ఇక ఆడ పిల్లల జీవితం రోజురోజుకీ ప్రశ్నార్థకంగానే మారిపోతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఆడ పిల్లల పై అత్యాచారం చేసిన వారిని శిక్షించేందుకు ఎన్ని కఠిన చట్టాలు తీసుకువచ్చినప్పటికి ఎక్కడ కామాంధులు తీరులో మాత్రం మార్పు రావడంలేదు.



 ముఖ్యంగా రక్తం పంచుకుని పుట్టిన బిడ్డల విషయంలో ఏకంగా కామాంధులు గా మారిపోయిన ఎంతో మంది తండ్రులు అత్యాచారాలకు పాల్పడుతున్న ఘటనలు ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కూతురిని  కామపు కోరలతో చూసి అదును చూసి అత్యాచారానికి పాల్పడుతున్నారు. చిత్తూరు జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రేణిగుంటకు చెందిన ఓ వ్యక్తి పద్నాలుగేళ్ల కూతురు పై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అక్టోబర్ 24వ తేదీన బయటకు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. విషయం బయటకు చెబితే ప్రాణాలు తీస్తాను అంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఇక బాధిత బాలిక ఈ విషయాన్ని తల్లికి చెప్పడంతో అసలు విషయం బయటపడింది. ఇక తల్లి సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: