అమ్మా.. నేను చనిపోతున్నా.. క్షమించు?

praveen
పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగు పెట్టాలని ప్రతి యువతి కూడా ఎన్నో కలలు కంటూ ఉంటుంది. అత్తవారింట్లో అడుగుపెట్టిన తర్వాత కొత్త జీవితాన్ని ఎలా ప్రారంభించాలి అనేదానిపై ఆశలు పెట్టుకుంటూ ఉంటుంది. ఇక్కడ యువతీ ఇలాగే ఆశలు పెట్టుకుంది. పెళ్లి తర్వాత తన జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది అని భావించింది. తన తండ్రిలాగే తనను ఎంతో సంతోషంగా చూసుకునే వ్యక్తి తనకు భర్తగా వస్తాడు అని ఆశ పడింది. తల్లిదండ్రులు చూసిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది. కానీ పెళ్లిచేసుకున్న కొన్ని రోజుల్లోనే భర్త అసలు రంగు బయటపడింది. అదనపు కట్నం కావాలి అంటూ వేధించడం మొదలుపెట్టాడు భర్త.



ఇక అదనపు కట్నం కోసం తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేయలేక.. భర్త వేధింపులు తాళలేక చివరికి మనస్థాపం చెందినసదరు మహిళ కఠిన నిర్ణయం తీసుకుంది. ఇక జీవితం వృధా అని భావించి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన మొయినాబాద్ లో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. మెదక్ జిల్లా తూప్రాన్ కి చెందిన శ్రావణి అనే యువతికి ఇటీవలే రాజశేఖర్ రెడ్డి తో వివాహం జరిగింది. అయితే వివాహం జరిగిన సమయంలో 40 తులాల బంగారం, 40 లక్షల నగదు,  తూప్రాన్ లో ఒక ఎకరం పొలం కట్నంగా ఇచ్చారు శ్రావణి తల్లిదండ్రులు.



 ఇక భారీగా కట్నం ఇచ్చాము కదా తమ కూతురు ఎంతో సంతోషంగా ఉంటుంది అని భావించారు. కానీ అల్లుడి అసలు స్వరూపాన్ని ఊహించలేకపోయారు. ఇటీవలే ఇంట్లో ఉరివేసుకుని ఉండడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఇక ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు హుటాహుటిన శోకంతో  నిండిపోయిన హృదయంతో కూతురి ఇంటికి చేరుకున్నారు. అయితే శ్రావణి ఆత్మహత్య చేసుకునే ముందు చివరిగా తల్లి పద్మ కు ఫోన్ చేసి మాట్లాడింది. తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని నా గురించి ఆలోచించకుండా సంతోషంగా ఉండండి.. నన్ను క్షమించండి అంటూ ఫోన్ కట్ చేసింది. అయితే భయాందోళనకు గురైన తల్లి మళ్ళీ తిరిగి ఫోన్ చేసినప్పటికీ ఫోన్ ఎత్తలేదు.  ఇక అంతలోనే శ్రావణి ఉరి వేసుకున్నట్లు వార్త శ్రావణి తల్లి పద్మ కు తెలిసింది. అయితే అదనపు కట్నం కోసం భర్త వేధించడం కారణంగానే ఇలా శ్రావణి ఆత్మహత్య చేసుకున్నట్టు అనుమానం వ్యక్తం చేసిన యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: