ఛీ ఛీ.. యువకుల పాడు పని.. జల్సాల కోసం?

praveen
ఈ మధ్య కాలంలో యువత పెడదోవ పడుతున్నారు. ఇక దీనికి నిదర్శనంగా ఎన్నో ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. వ్యాపారం చేసుకుని సభ్య సమాజంలో ఎంతో గౌరవంగా బతకడం కంటే దొంగతనాలకు పాల్పడుతూ ఇక వచ్చిన డబ్బుతో జల్సాలు చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఇలా యువత నేటి రోజుల్లో చెడు దారుల్లో వెళ్తూ ఎన్నో నేరాలకు పాల్పడుతున్న సంఘటనలు కోకొల్లలుగా తెర మీదకు వస్తున్నాయి. ముఖ్యంగా చెడు అలవాట్లకు  బానిసలుగా మారిపోయి చివరికి డబ్బుల కోసం దొంగతనాలకు పాల్పడటం.. మరిన్ని దారుణమైన పనులు చేయడం లాంటివి కూడా చేస్తూ ఉన్నారు.

 ఇక్కడ కొంతమంది యువకులు చేసిన పని స్థానికంగా హాట్ టాపిక్ గా మారిపోయింది. అంతేకాదు పోలీసులనే షాక్ అయ్యేలా చేసింది. ఏకంగా జల్సాలకు అలవాటు పడ్డ యువకులు పెడదోవ పట్టారు. పనిచేసిన చోటే దొంగతనానికి పాల్పడ్డారు. ప్రకాశం జిల్లా కుంభంలో వెలుగులోకి వచ్చింది ఈఘటన. గుంటూరు జిల్లా మాచర్ల కు చెందిన ఇద్దరు.. వినుకొండకు చెందిన ఒక్కరూ ముఠాగా ఏర్పడ్డారు. ఈ క్రమంలోనే దొంగతనాలకు పాల్పడేందుకు పక్కా ప్లాన్ వేసుకునేవారు  అయితే వారు పనిచేసిన సెల్ఫోన్ టవర్ల లో ఉన్న బ్యాటరీలను కాజేసేవారు  ఇక వాటిని అమ్ముకుని సొమ్ము చేసుకునే వారు.

 వచ్చిన డబ్బులతో జల్సా చేసేవారు ఈ ముగ్గురు ముఠా సభ్యులు. ఇటీవలే సెల్ ఫోన్ టవర్ నిర్వాహకుల నుంచి బ్యాటరీలు పోతున్నాయి అంటూ వరుసగా పోలీసులు ఫిర్యాదులు అందుకున్నారు. దీంతో ఇకకేసుపై సీరియస్గా దృష్టి పెట్టారు పోలీసులు. పలు బృందాలుగా ఏర్పడి సెల్ ఫోన్ టవర్ దగ్గర నిఘా పెంచారు. ఈ క్రమంలోనే ముగ్గురు ముఠా సభ్యులను అరెస్టు చేశారు. వారి దగ్గర నుంచి 18విలువైన బ్యాటరీలు మూడు లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. అయితే సెల్ఫోన్ టవర్ లలో టెక్నీషియన్  పని చేసే ఈ ముగ్గురూ గత కొన్ని రోజుల నుండి చెడు అలవాట్లకు బానిసలుగా మారిపోయారు. దీంతో విలువైన బ్యాటరీలను దొంగలించి వాటిని అమ్ముకుని వచ్చిన డబ్బుతో జల్సాలు చేయడం మొదలుపెట్టారు. చివరికి కటకటాలపాలయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: