నేరస్తుడు చేసిన పనికి పోలీసులు షాక్..!!

N.ANJI
సాధారణంగా సినిమాలో పోలీసుల నుండి నేరస్తులు తప్పించుకుంటూ ఉంటారు. అలాగే నిజ జీవితంలోను ఓ ఖైదీ పోలీసుల నుండి తప్పించుకున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హైదారాబాద్‌కు చెందిన రమేష్ రెడ్డి వ్యక్తి రాజస్థాన్‌కు చెందిన ఓ వ్యాపారీ వద్ద ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇక ఇటివల రమేష్ రెడ్డి తన యజమాని ఖాతా నుండి ఏడు లక్షల రూపాయలు స్వాహా చేశాడనే ఆరోపణలు చేస్తూ రాజస్థాన్‌లో కేసు నమోదు చేశారు.
అయితే రమేష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి రాజస్థాన్ నుండి ఒక అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్, ఇద్దరు కానిస్టేబుళ్లు గురువారం ఉదయం హైదరాబాద్ వచ్చారు.వారు మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ లోని పోలీసులు సాయంతో రూ .7 లక్షలు మోసం చేసిన కేసులో రమేష్‌ను అరెస్టు చేసి రమేశ్ రెడ్డిని నాంపల్లిలోని ఓ లాడ్జికి తీసుకెళ్లారు. ఇక వారు జైలు ట్రాన్సిట్ వారెంట్ తీసుకోలేదంట. కాగా అతడిని సంబంధిత స్థానిక కోర్టు ముందు హాజరు పరచలేదు. ఈ తరుణంలోనే రమేశ్ రెడ్డికి ముగ్గురు పోలీసులు రాత్రంతా కాపలాగా ఉన్నారని అధికారులు వెల్లడించారు.
ఇక శుక్రవారం ఉదయం 5.30 గంటలకు, ASI నిద్రలేచి వాష్‌ రూమ్‌కు వెళ్ళిరాగా.. ఆ తరువాత, రమేష్ రెడ్డి కూడా వాష్‌రూమ్ వెళతానని పోలీసులను అడగడంతో వాళ్ళు వెళ్లడానికి అనుమతిని ఇచ్చారు. అయితే రమేష్ రెడ్డి వాష్‌రూమ్‌ను లోపలి నుండి లాక్ చేసుకున్నాడు. అతడు ఎంతసేపటికి బయటికి రాకపోవడంతో పోలీసులు బలవంతంగా తలుపులు పగలకొట్టి చూశారు. అయితే వాష్‌రూమ్‌ లో నిందితుడు ఉరి వేసుకుని కనిపించాడని సెంట్రల్ జోన్ జాయింట్ కమిషనర్ విశ్వప్రసాద్ వెల్లడించారు. ఇక సమాచారం అందుకున్న తర్వాత నాంపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బాత్రూం నుండి బయటకు తీసి పోస్టుమార్టు నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే నిందితుడు పోలీసులు అదుపులో ఉన్నప్పుడు చనిపోయాడు కాబట్టి కస్టోడియల్ డెత్ కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: