అసలే దొంగ.. ఆపై ఆర్థిక సమస్యలు.. చివరికి ఏం చేశాడంటే?

praveen
ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా దొంగల బెడద రోజురోజుకు ఎక్కువవుతోంది.  దీంతో ఇక జనాల్లో కూడా భయం అంతకంతకు పెరిగి పోతూనే ఉంది. దీంతో  జనాలు అనుక్షణం భయపడుతూ బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆన్లైన్లో సైబర్ నేరగాళ్లు కాపు కాచుకుని సమయం దొరికితే చాలు ఖాతాలను ఖాళీ చేస్తూ ఇక భారీగా డబ్బులు దండుకుంటున్నారు.  ఇక మరోవైపు దొంగలు ఇంటిని గుల్ల చేస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు.  ఇక మరికొంతమంది వాహనాలను ఎత్తుకెళ్లి ఎంతోమందికి షాక్ ఇస్తున్నారు.


 ఇంకొంతమంది రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుంటే ఏకంగా మెడలోని బంగారాన్ని లాక్కుని వెళ్ళిపోతున్నారు. ఇలా అడుగడుగునా దొంగల బెడద జనాలను ఇబ్బందులు పడుతూనే ఉంది.  ఇక ఏదో ఒక విధంగా జనాలను నిలువు దోపిడి చేయడానికి దొంగలు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇకపోతే ఇటీవల ఒక వ్యక్తి ఆటో చోరీ చేశాడు ఇక ఆ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన హైదరాబాద్ లోని మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. తుకారం గేట్ కి చెందిన జాన్ అలియాస్ సోను అనే వ్యక్తి ఆహార పదార్థాలు సరఫరా లో కంపెనీ లో పని చేస్తూ ఉంటాడు.



 అయితే 2010లో ఇతని పై రెండు చోరీ కేసులు నమోదు కాగా.. ప్రస్తుతం చోరీలను మానేసి పని చేసుకుంటూ బ్రతుకుతున్నాడు. కానీ ఇటీవలి కాలంలో కరోనా వైరస్ కారణంగా ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. దీంతో మరోసారి అతనిలో దొంగ బుద్ధి బయటపడింది. ఈ క్రమంలోనే ఇటీవల అర్ధరాత్రి సమయంలో మల్కాజ్గిరి కి వచ్చి వీణపాని నగర్ లో ఇంటి ముందు ఉంచిన ఆటోను ఎత్తుకెళ్లాడు  ఇక ఉదయం లేచి చూసి బాధితుడు షాక్ అయ్యి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు  ఇక సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు  ఆటోను దొంగిలించింది పాత దొంగ అని నిర్ధారించాడు.  నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టగా ఇటీవలే చోరీ చేసిన ఆటో లోనే నిద్రపోతూ ఉన్న నిందితుడిని పట్టుకున్నారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: