పాపం.. దొంగగా మారిన డాన్స్ మాస్టర్?

praveen
కరోనా వెలుగులోకి వచ్చి ఎంతోమంది ప్రాణాలను బలి తీసుకోవడమే కాదు ఇంకా ఎంతోమందినీ బ్రతుకు కంటే చావు చాలా మేలు అనే పరిస్థితి తీసుకు వచ్చింది.  సాఫీగా సాగిపోతున్న ఎంతోమంది జీవితాల్లో అల్లకల్లోలం సృష్టించింది  వైరస్.  ఉన్నా దాంట్లో సర్దుకుని బ్రతుకుతున్న వారికి అసలు ఉపాధి లేకుండా చేసి పస్తులు ఉండే పరిస్థితులు తీసుకొచ్చింది. దీంతో ఉపాధి లేక కుటుంబ పోషణ కోసం ఎంతో మంది ఇటీవల కాలంలో నేరస్థులుగా కూడా మారుతున్నారు. మొన్నటివరకు ఇక సభ్యసమాజంలో ఉద్యోగము వ్యాపారము చేసుకుంటూ గౌరవంగా బ్రతికినవారు.


 ఇక ఇప్పుడు బతుకు దెరువు కోసం ఏకంగా చేసేదేమీలేక నేరస్తులుగా మారిపోతున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది  ఏకంగా కరోనా వైరస్ కారణంగా వచ్చిన ఆర్థిక కష్టాలు డాన్స్ మాస్టర్ ను దొంగగా మార్చాయ్. చివరికి చైన్ స్నాచర్స్ గా మారిన దొంగ పోలీసులకు దొరికి కటకటాల పాలు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది  మొదటి చోరీ చేసిన ఒక్కరోజులోనే పోలీసులు ఈ దొంగను పట్టుకున్నారు. ఈ ఘటన హైదరాబాద్లోని ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.



 కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం పెద్దపల్లి కి చెందిన సుచరిత మాదాపూర్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగి. ఇక మధురానగరిలో హాస్టల్లో ఉంటున్న ఆమె ఇటీవలే మెట్రో స్టేషన్ వద్ద లిఫ్ట్ కోసం ఎదురుచూస్తుంది. అదే సమయంలో నల్గొండ జిల్లా నార్కట్ పల్లి కి చెందిన వినోద్ వెనుక నుంచి వచ్చిన తర్వాత మెడలో నుంచి 45 వేల విలువైన బంగారు గొలుసును లాక్కెళ్లాడు. ఇక ఇదంతా మెట్రో స్టేషన్ లో ఉన్న సీసీటీవీ లో రికార్డ్ అయ్యింది. ఈ దృశ్యాలు ఆధారంగా నిందితుడిని అరెస్టు చేశారు  తరువాత అతడు అతని బాధలు పోలీసులకు చెప్పుకున్నాడు. ఎంబీఏ చదివిన వినోద్ డాన్స్ మాస్టర్ గా పని చేస్తున్నాడు. కరోనా  వైరస్ కారణంగా ఆర్థిక కష్టాలతో దొంగగా మారినట్లు చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: