సమాజంలో మానవ సంబంధాలు మసకబారి పోతున్నాయి. వావివరసలు మంట కలిసిపోతున్నాయి. ఎవరు ఎవరితో ఎలా ప్రవర్తిస్తున్నారో అర్థం కావడం లేదు. అక్రమ సంబంధాలు ప్రాణాల మీదికి వస్తున్నాయి. ఈ అక్రమ సంబంధాల మోజులో పడి రోజు ఎంతో మంది నేరాలు చేసి కటకటాల పాలవుతున్నారు. అసలు ఏం జరుగుతోంది..?
అసలు చట్టాలకు వీరు భయపడడం లేదా..?
చంపడం అనేది ఇంత అలవోకగా ఎలా చేస్తున్నారు..?
నేరం చేసిన వారికి తగిన శిక్షలు పడడం లేదా..?
అక్రమ సంబంధాల పేరుతో ఎన్నో సంబంధబాంధవ్యాలు తగ్గిపోతున్నాయి. ఎన్నో కుటుంబాలు మసకబారిపోతాయి. వావివరుసలు మంట కలిసిపోతున్నాయి. చివరికి ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోతున్నాయి. అయినా ఈ మనిషి మారడం లేదు. మృగంలా మారి మరణ శాసనం గీస్తున్నాడు.
అలాంటి ఓ ఘటనే ఇక్కడ జరిగింది. తాత్కాలిక సుఖం కోసం కుటుంబాలను రోడ్డున పడేస్తున్నారు. అగ్ని సాక్షిగా ఒక్కటైన బంధాలను బుగ్గిపాలు చేస్తున్నారు. ప్రస్తుత కాలంలో పోలీస్ స్టేషన్లో ఒక 10 కేసులు నమోదైతే, అందులో కనీసం ఆరు కేసులు వివాహేతర సంబంధాలకు సంబంధించిన ఉంటున్నాయి. అంటే ఈ అక్రమ సంబంధాలు ఏ విధంగా సాగుతున్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఒక ప్రాంతం నుంచి ఓ వ్యక్తి అదృశ్యమైన కేసును దర్యాప్తు చేయగా పోలీసులకు విస్తుపోయే షాకింగ్ నిజాలు తెలిశాయి. అది ఏంటో తెలుసుకుందాం..?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా కేంద్రంలోని పామిడి మండల పరిధిలోని ఎదురురికి చెందిన పెద్దయ్య 35 సంవత్సరాలు. ఆయన ఈనెల 11వ తారీకున అదృశ్యమయ్యాడు. అతని తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసి సంచలన నిజాలు బయటకు చెప్పారు. విచారణలో భాగంగా పెద్దయ్య గురించి ఆరా తీయగా వివాహేతర సంబంధం వల్ల ఆయన హత్యకు గురయ్యాడని నిర్ధారణ చేశారు. ఎదురురుకు చెందిన సుంకమ్మ అలియాస్ సుజాతకు కొన్ని సంవత్సరాల క్రితం రమేష్ అనే వ్యక్తితో వివాహం జరిగింది.
అయితే ఆమెకు అదే గ్రామానికి చెందినటువంటి పెద్దయ్యతో అంతకు ముందే వివాహేతర సంబంధం ఉంది. ఈ క్రమంలో సుంకమ్మ మేనమామ అయినా శంకరయ్యకు పెద్దయ్య భార్య అయినా బాలక్కతో కూడా వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయం పెద్దయ్యకి తెలిసిపోయింది. దీంతో పెద్దయ్య శంకరయ్యతో పలుమార్లు గొడవ పడ్డాడు. తను చంపేస్తానని కూడా బెదిరించాడు. దీంతో భయపడిన శంకరయ్య అతను నన్ను ఎలాగైనా చంపేస్తాడు అని భావించి, ముందుగానే పెద్దలను లేపేస్తే ఏ ప్రాబ్లం ఉండదు అనుకున్నాడు. పథకం ప్రకారం స్కెచ్ గీసి పెద్దయ్యను హతమార్చాడు. చివరికి పోలీసులకు దొరికిపోయి కటకటాల పాలయ్యాడు.