మహిళ శరీరంపై అది ఎక్కడ తాకినా రేపే చేసినట్టే..?

MOHAN BABU
దేశంలో   మానవత్వం మంటగలిసి పోతుంది. విదేశీ సంస్కృతికి అలవాటు పడి మానవతా విలువలు మరుస్తున్నారు. తల్లికి బిడ్డకు తేడా లేకుండా, ఇష్టం వచ్చినట్లు  వ్యవహరిస్తున్నారు. ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా, ఎన్ని శిక్షలు వేసినా  ఆడపిల్లలపై మాత్రం  అఘాయిత్యాలు ఆగడం లేదు.  దీనిపై  కేరళ హైకోర్టు మరో సంచలన నిర్ణయం తీసుకుంది. మహిళ శరీరంపై అలా ఎక్కడ టచ్ చేసినా లైంగిక దాడికి కిందికే పరిగణిస్తామని  సంచలన తీర్పును ప్రకటించింది. అది ఏంటో చూద్దాం.. ఒక లైంగిక దాడి జరిగిన కేసులో  కేరళ హైకోర్టు  చాలా అరుదైన తీర్పును వెలువరించింది. పురుషుడు  తన పురుషాంగంతో  మహిళ యొక్క శరీరంపై తనకు ఇష్టం లేకుండా  ఎక్కడ తాకిన అది అఘాయిత్యం కిందికే వస్తుందని హైకోర్టు వివరణ ఇచ్చింది. మహిళ యొక్క శరీరంలోకి అంగం ప్రవేశం జరగకున్న అది లైంగిక దాడి గానే పరిగణించాల్సి వస్తుందని తీర్పు జారీ చేసింది. 6 నెలల క్రితం జరిగినటువంటి 11సంవత్సరాల బాలికపై అత్యాచారం కేసులో అంగప్రవేశం జరగలేదు  అయినా దానిని లైంగిక దాడి గానే పరిగ ణించరాదని కోరుతూ సదరు నిందితుడు హైకోర్టుకు వెళ్ళాడు.


నేను అఘాయిత్యం చేయలేదని, తన యొక్క పురుషాంగం బాలిక యొక్క తొడలను మాత్రమే తాకిందని, అది రేప్ ఎలా అవుతుందని నిందితుడు తన పిటిషన్లో రాశాడు. దీనిపై సమగ్ర విచారణ జరిపి నటువంటి హైకోర్టు మహిళ శరీరంలోకి ఏ ఒక్క అవయవంలోకైనా చొచ్చుకుపోవడానికి   చేసేటువంటి ఏ పనైనా లైంగిక దాడి కిందనే పరిగణించాలని హైకోర్టు తీర్పు వెలువరించింది. సదరు నిందితుడు తన పురుషాంగాన్ని బాలిక యొక్క  తొడలపై తాకడంతో సంతృప్తి పొందినా అది అత్యాచారమే నని  జస్టిస్ జియాద్  రహమాన్, కె. వినోదు చంద్రన్ కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. కాగా సదరు నిందితుడు ఆ బాలికకు చాలాసార్లు  పోర్న్ వీడియోలు చూపించేవాడని, ఆమెతో అసభ్యంగా ప్రవర్తించే వాడని, ఆమె శరీర భాగాలను తరచు తాకే వాడని, పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలిపారు. ఈ విషయాన్ని తన ఇంట్లో చెప్పవద్దని సదరు బాలికను బెదిరించేవాడు అని తెలిపారు.


అయితే నిందితుల తరపున ఉన్నటువంటి న్యాయవాది సెక్షన్ 370 ప్రకారం కేసు నమోదు అయిందని, ఈ సెక్షన్ ప్రకారం అంగ శరీరం లోపలికి వెళితేనే ఇలాంటి కేసులు నమోదు చేయాలని, ఆయన అన్నాడు. నిందితుడి తరపున వచ్చిన న్యాయవాది చేసిన వ్యాఖ్యలను హైకోర్టు పక్కన పెట్టేసింది. మూత్రనాళం, జననాంగం, నోరు వంటి వాటిల్లోనే కాకుండా ఇతర శరీర భాగాలపై కూడా పురుషాంగంతో  దాడి చేసిన అది అఘాయిత్యంగానే పరిగణించాలని అన్నది. సెక్షన్ 375 సి చదివితే కనబడుతుందని సదరు న్యాయవాది చురకలు అంటించింది. సదరు నిందితునికి జీవిత ఖైదు విధించాలని హైకోర్టు తీర్పును వెలువరించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: