ప్రేమించి పెళ్లి అంతలోనే చావు.. ఏం జరిగింది..?

MOHAN BABU
టెక్నాలజీ ఎంత పెరిగినా  కొంతమందిలో మాత్రం మార్పు రావడం లేదు  కుల, మతాల కోసం సొంత వారిని హతమార్చే  పరిస్థితికి దిగజారుతున్నారు. కొంతమందేమో ఆస్తుల కోసం కట్నాల కోసం వేధించి చంపుతున్నారు. ఇలా ఒక్కో దగ్గర ఒక విధంగా  ఆడపిల్లలకు కష్టాలే వస్తున్నాయని చెప్పవచ్చు. ఆడపిల్లలు ప్రపంచ స్థాయిలో మన దేశ కీర్తిని  నిలబెడుతున్నారు. ఇంత టెక్నాలజీ పెరిగినా, ఇంత ఘనత సాధించిన  ఆడా, మగా, కుల, మత  తారతమ్యం మాత్రం పోవడం లేదు అని చెప్పవచ్చు. కుల మత పిచ్చిలో కుళ్ళు     రాజకీయాలతో  మానవ సమాజం బ్రతుకుతుంది అని చెప్పడానికి సిగ్గనిపిస్తోంది. 
కట్నం కోసం  అత్తింటి వారి వేధింపులు భరించలేక  యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. రెండు రోజుల పాటు మృత్యువుతో పోరాడి ఆ తల్లి మృతి చెందింది. ఏ విధంగా మానసిక క్షోభ అనుభవించిందో  ఒక లేఖలో రాసి వివాహిత చనిపోయింది. వివరాల్లోకి వెళితే మంచిర్యాల జిల్లాచెన్నూర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆమె రాసిన లేఖలో  నా లైఫ్ లోకి నువ్వు ఎందుకు వచ్చావు కిరణ్..  నువ్వు పరిచయం కాకముందు నేను చాలా ఆనందంగా ఉండేదాన్ని, కానీ పెళ్లయిన తర్వాత మాత్రం  ఏ రోజు కూడా నా మొఖం మీద చిరునవ్వు మాత్రం రాలేదు. నువ్వు నన్ను ఎన్ని సార్లు వేధించిన కనీసం మా తల్లిదండ్రులు కూడా చెప్పలేదు.


ఒక్కోసారి  కనీసం మీ ఫ్రెండ్స్ కైనా చెప్పాలనుకున్న.. కానీ నీ యొక్క పరువు ఎక్కడ పోతుందో అని సైలెంట్ గా ఉండిపోయా..  ఆ యువతి  ఆడుతూ పాడుతూ  చాలా ఆనందంగా గడిపేది. జీవితంపై ఎన్నో ఆశలతో, ఆశయంతో ముందుకు వెళ్తున్న సమయమది. వారి కుటుంబంలో నలుగురు అమ్మాయిలు ఉండటంతో ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ఆ యువతి జీవితం సాఫీగా సాగిపోతు ఉండేది. అనుకోకుండా ఆమె జీవితంలోకి ఈ ప్రేమ వైరస్ ప్రవేశించినది. అనుకోకుండానే పెళ్లి కూడా జరిగింది. అంతలోనే ఆత్మహత్య చేసుకుంది యువతి. వారి యొక్క కుటుంబానికి  వెలుగుని ఇవ్వాల్సిన వెన్నెల చీకటిగా మారింది. అత్త  వారింటి వేధింపులతో చివరికి తన ప్రాణాలు వదిలింది. మంచిర్యాల జిల్లాలోని  కోటపల్లి మండల కేంద్రంలోని  సిరుస గ్రామానికి చెందినటువంటి సత్తయ్య శారద దంపతులకు  నలుగురు బిడ్డలే. మా ఇద్దరు భార్యాభర్తలు వ్యవసాయ కూలీ చేస్తుంటారు. కూలీ చేస్తూనే పెద్ద కూతురు పెళ్లి కూడా చేసేశారు. ఇందులోనే మూడో అమ్మాయి వెన్నెల 26 సంవత్సరాలు. ఈమెకు చదువంటే ఎక్కువగా ఆసక్తి ఉండడంతో ఆమెను చదివించాలి అనుకున్నారు. ఈ అమ్మాయి మంచిర్యాల జిల్లాలో  బీకాం సెకండ్ ఇయర్ చదువుతున్న క్రమంలో వారి గ్రామానికి చెందినటువంటి కిరణ్ కుమార్  ప్రేమిస్తున్నానంటూ వెంటపడేవాడు. వివాహం కూడా చేసుకుంటాను అని ఆమెను బ్రతిమిలాడాడు. కులాలు వేరు కాబట్టి పెద్దలు అంగీకరించరని వెన్నెల చెప్పినా  కిరణ్ వినలేదు. ఆమెకు మాయమాటలు చెప్పి చచ్చిపోతాను అని బెదిరింపులకు గురి చేశాడు.


దీంతో వెన్నెల  నమ్మి వివాహానికి అంగీకరించింది. వెంటనే వారిద్దరూ  పెద్దలను ఎదిరించి మరి పెళ్లి చేసుకున్నారు. కొత్త జీవితం మొదలు పెట్టారు . వీరిద్దరు చెన్నూరులో  ఒక అద్దె ఇంట్లో ఉండేవారు. అక్కడే కిరణ్  ఒక క్లాత్ స్టోర్ కూడా నిర్వహించాడు. కరోనా కారణంగా నష్టాలు వచ్చాయి. దీంతో  కష్టాలు ప్రారంభమయ్యాయి. 10 లక్షల కట్నం కేవలం కిరణ్ కుమార్ వెన్నెలను వేధించడం ప్రారంభించాడు. దీంతో వెన్నెల మోసపోయానని గ్రహించి, ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. అటు భర్తతో ఉండలేక, పుట్టింటి కూడా వెళ్ళలేక తనకు తానే కుమిలిపోయి మూడు పేజీల సూసైడ్ నోట్ రాసి, మరొక జన్మంటూ ఉంటే మనిద్దరం ఒకే కులంలో పుడదామని ముగింపు ఇచ్చి పురుగుల మందు తాగి  మృత్యువుతో పోరాడుతూ ఆస్పత్రిలో మరణించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: