ఖమ్మంలో భారీ పేలుడు.. తృటిలో తప్పించుకున్న పోలీసులు..?

MOHAN BABU
 మనం చిన్న చిన్న టపాసులు కాల్చే వాటి నుంచి వచ్చే శబ్దాలకు ఎంతో భయపడిపోతాం. అలాంటివి కళ్ళ ముందే అంత పెద్ద బాంబు పేలుళ్లు జరిగాయి. చాకచక్యంగా పోలీసులు వాటిని దాటి నుంచి  తప్పించుకొని ప్రాణాలు కాపాడుకున్నారు. అసలు ఆ పేలుళ్ళు ఎందుకు జరిగాయి. ఎలా జరిగాయి..?  ఖమ్మం పోలీసులకు పెను ప్రమాదం తప్పింది అని చెప్పవచ్చు. పేలుడు పదార్థాలను నిర్వీర్యం చేస్తున్న ఈ సందర్భంలో చోటుచేసుకున్న ఈ ప్రమాదం వారి పేలుడుకు దారితీసింది.  దురదృష్టవశాత్తు అక్కడ ఉన్నటువంటి పోలీసులంతా చాకచక్యంతో ఎలాంటి ప్రాణ నష్టం  జరగకుండా బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కానీ పేలుడు ధాటికి అక్కడ ఉన్నటువంటి జెసిబి ముందు భాగం పూర్తిగా విరిగిపోయింది. అది ఎక్కడ జరిగిందో తెలుసుకుందాం..


 మన పొరుగు రాష్ట్రమైన చత్తీస్గడ్, ఒడిస్సా రాష్ట్రాలలోని  వామపక్ష తీవ్రవాద అవసరాలకు లేదా ఇతర వ్యాపారాలకొ తెలియదు కానీ  అక్రమంగా రవాణా చేస్తున్నటువంటి జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్ లు, బ్లాక్ పౌడర్లను  ఖమ్మం పోలీసులు గత కొద్ది సంవత్సరాల నుండి భారీగా పట్టు కున్నారు. ఈ పట్టుకున్న వారికి సంబంధించి కేసులు ఇంకా కోర్టులో నడుస్తున్నాయి. అయితే కోర్టు ఆదేశానుసారం నిల్వ ఉంచిన పేలుడు పదార్థాలను నిర్వీర్యం చేయాలని కోర్టు ఆదేశించింది. దీంతో ఖమ్మం రూరల్ మండలం అయిన తనగంపాడు, మంగళ గూడెం గ్రామాల మధ్యలో ఉన్న ఎవరూ లేని ప్రాంతంలో వీటి నిర్వీర్యం చేయాలని పోలీసులు అక్కడికి ఈ బాంబు పదార్థాలు తీసుకెళ్లారు. వీటి నిర్వీర్యం కోసం ప్రత్యేకంగా  హైదరాబాద్ నుంచి  బాంబు డిస్పోజల్ బృందాలను తీసుకొచ్చారు. ఇక ఆ పేలుడు పదార్థాలను నిర్వీర్యం చేయడం కోసం పెద్ద గొయ్యి తీసి జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్ల ను నిర్వీర్యం చేసి అందులో వేశారు. ఇక బస్తాల లో ఉన్నటువంటి బ్లాక్ పౌడర్ ను ఆ గోతిలోకి నెట్టి మట్టితో కప్పుతున్న  సమయంలో జెసిబి బకెట్ కు ఒక రాయి బలంగా తగిలి స్పార్క్ రావడంతో ఒక్కసారిగా భారీ పేలుడు జరిగింది. ఊహించని విధంగా  ఈ పేలుడు జరగడంతో  పోలీసులంతా చెల్లాచెదురై పోయారు. పేలుడు ధాటికి జెసిపి ముందు భాగం మొత్తం నుజ్జునుజ్జయింది. అంటే అక్కడ బాంబు తీవ్రత ఏ విధంగా ఉందో  దీన్ని బట్టి చూస్తే అర్థం చేసుకోవచ్చు.

 ఒక్కసారి చోటు చేసుకున్న ఈ ఘటనతో ఖమ్మం పట్టణంలోని  టీఎన్జీవో కాలనీ, రెడ్డిగూడెం, రాపర్తి నగర్, పేలుడు జరిగిన తనగంపాడు, మంగళ గూడెం, ప్రజలు ఒక్కసారిగా  ఉలిక్కి పడ్డారు. పట్టపగలే  జరిగిన ఈ పేలుడు కారణం ఏంటని కొద్దిసేపు రకరకాల ఊహాగానాలు కనిపించాయి. ఒకవేళ డిటోనేటర్లను, జిలెటిన్ స్టిక్స్ ను నిర్వీర్యం చేయకుండా అందులో వేసి ఉంటే పేలుడు ఇంకా ఎంత తీవ్రంగా ఉండేదో అని పోలీసులు చెబుతున్నారు.  దీనిపై  రాబోవు రోజుల్లో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: