కడుపునొప్పితో హాస్పిటల్ వెళ్లిన 8వ తరగతి విద్యార్థి.. అక్కడ షాకింగ్?
ఇక ఆ తర్వాతే బాలికను బంధువులు ప్రయత్నించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆ బాలిక తల్లిదండ్రులు చిన్న వయసులోనే చనిపోవడంతో అమ్మమ్మ వద్దనే ఉంటూ చదువుకుంటుంది బాలిక. ఇక బాలికకు వెనక ముందు ఎవరూ లేరు అన్న గమనించాడు ఓ కామాంధుడు. ఈ క్రమంలోనే అభం శుభం తెలియని ఎనిమిదో తరగతి బాలికపై లైంగిక వాంఛలు తీర్చుకోవడానికి శివ అనే యువకుడు భావించాడు. ఈ క్రమంలోనే ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. మాయమాటలతో బాలికను లొంగదీసుకున్నాడు. పలుమార్లు అత్యాచారం చేసి గర్భవతిని చేశాడు. ఇటీవలే ఒక్కసారిగా బాలికకు తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది.
వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు బాలిక గర్భం దాల్చినట్లు వెల్లడించారు. దీంతో అక్కడున్న బంధువులందరూ షాకయ్యారు ఇక ఆ తర్వాత బాలికను మందలించగా జరిగిన విషయం చెప్పింది. శివ అనే యువకుడు ప్రేమ పేరుతో తనకు మాయమాటలు చెప్పి పలుమార్లు శారీరక వాంఛలు తీసుకున్నాడు అంటు బంధువులకు తెలిపింది. ఇక బాలిక చెప్పిన వివరాలతో బంధువులు శివ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితున్ని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అంతేకాదు పోక్సో చట్టం కింద అతనిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.